Home » Entertainment » Chiranjeevi Gives Chance To Dasara Director Srikanth Odela
Entertainment

Dasara Movie Director : ఒకే ఒక్క కండిషన్ తో దసరా సినిమా డైరెక్టర్ కి చిరంజీవి చాన్స్ !

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: April 26, 2023, 4:03 pm
Advertisement

Dasara Movie Director : ఈ సంవత్సరంలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి బలగం, దసరా అనే చెప్పుకోవాలి. నిజానికి దసరా సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. ఊర మాస్ సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. 2023 లో బిగ్గెస్ట్ హిట్ దసరా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఇదివరకు సినిమాలు తీసిన అనుభవం కూడా లేదు. కానీ.. తొలిసారి దర్శకత్వం వహించి సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం శ్రీకాంత్ ఓదెల వైపు చూస్తోంది.

Advertisement

chiranjeevi gives chance to dasara director srikanth odela

దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల సినిమా ఏంటి. ఎవరితో తీస్తున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. అయితే.. మెగాస్టార్ చిరంజీవితో తన తదుపరి సినిమా ఉంటుంది అని అందరూ అంటున్నారు. ఒకటి రెండు సినిమాలకు దర్శకత్వం వహించి ఇప్పుడు ఏకంగా చిరంజీవితోనే సినిమా అంటే మామూలు విషయం కాదు. నిజానికి చిరంజీవి కూడా ఈ మధ్య యువ దర్శకులను ప్రోత్సహిస్తున్నారు. అందుకే.. శ్రీకాంత్ చెప్పిన స్టోరీ లైన్ చిరంజీవికి నచ్చిందట. కథ మొత్తం నచ్చితే వెంటనే చాన్స్ ఇచ్చేస్తానని చిరంజీవి.. శ్రీకాంత్ కు చెప్పినట్టు తెలుస్తోంది.

Advertisement

Dasara Movie Director : భోళా శంకర్ తర్వాత శ్రీకాంత్ ఓదెల సినిమా ఉంటుందా?

ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. భోళా శంకర్ సినిమా తర్వాత తన కొత్త సినిమా ప్రకటిస్తారట. ఆ సినిమా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనే ఉండబోతుందని అంటున్నారు. కాకపోతే ఆ సినిమా స్టోరీ పూర్తిగా విన్నాక అది నచ్చితేనే శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి చాన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల సినిమా తీస్తే.. ఇక శ్రీకాంత్ రెండు సినిమాలకే సూపర్ సక్సెస్ డైరెక్టర్ అయ్యే చాన్స్ ఉంది. రెండు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి