Dasara Movie Director : ఒకే ఒక్క కండిషన్ తో దసరా సినిమా డైరెక్టర్ కి చిరంజీవి చాన్స్ !

Authored By Breaking News 2 | The Telugu News | Updated on: April 26, 2023, 4:03 pm

Dasara Movie Director : ఈ సంవత్సరంలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి బలగం, దసరా అనే చెప్పుకోవాలి. నిజానికి దసరా సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. ఊర మాస్ సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. 2023 లో బిగ్గెస్ట్ హిట్ దసరా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఇదివరకు సినిమాలు తీసిన అనుభవం కూడా లేదు. కానీ.. తొలిసారి దర్శకత్వం వహించి సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం శ్రీకాంత్ ఓదెల వైపు చూస్తోంది.

chiranjeevi gives chance to dasara director srikanth odela

chiranjeevi gives chance to dasara director srikanth odela

దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల సినిమా ఏంటి. ఎవరితో తీస్తున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. అయితే.. మెగాస్టార్ చిరంజీవితో తన తదుపరి సినిమా ఉంటుంది అని అందరూ అంటున్నారు. ఒకటి రెండు సినిమాలకు దర్శకత్వం వహించి ఇప్పుడు ఏకంగా చిరంజీవితోనే సినిమా అంటే మామూలు విషయం కాదు. నిజానికి చిరంజీవి కూడా ఈ మధ్య యువ దర్శకులను ప్రోత్సహిస్తున్నారు. అందుకే.. శ్రీకాంత్ చెప్పిన స్టోరీ లైన్ చిరంజీవికి నచ్చిందట. కథ మొత్తం నచ్చితే వెంటనే చాన్స్ ఇచ్చేస్తానని చిరంజీవి.. శ్రీకాంత్ కు చెప్పినట్టు తెలుస్తోంది.

Nani- Srikanth Odela: హీరో నానిపై సీరియస్ అయిన డైరెక్టర్ శ్రీకాంత్.. వీడియో  వైరల్.. - OK Telugu

Dasara Movie Director : భోళా శంకర్ తర్వాత శ్రీకాంత్ ఓదెల సినిమా ఉంటుందా?

ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. భోళా శంకర్ సినిమా తర్వాత తన కొత్త సినిమా ప్రకటిస్తారట. ఆ సినిమా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనే ఉండబోతుందని అంటున్నారు. కాకపోతే ఆ సినిమా స్టోరీ పూర్తిగా విన్నాక అది నచ్చితేనే శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి చాన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల సినిమా తీస్తే.. ఇక శ్రీకాంత్ రెండు సినిమాలకే సూపర్ సక్సెస్ డైరెక్టర్ అయ్యే చాన్స్ ఉంది. రెండు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది.

Breaking News 2

No bio available for this author.

  1. "Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్‌లో ఊహించని ట్విస్ట్.. నామినేషన్లలో టాప్ కంటెస్టెంట్లు.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరు?"

  2. "Rahul Gandhi Indira Gandhi : నానమ్మ ఇందిరా గాంధీతో చిన్నారి రాహుల్ గాంధీ ముచ్చట్లు.. 45 ఏళ్ల నాటి అరుదైన పోస్ట్‌ వైరల్!"

  3. "Chandrababu : కూటమి, వైసీపీ మధ్య భారీ గ్యాప్.. చంద్రబాబు చెప్పిన లెక్కలివే!"

  4. "Varanasi Movie Story Leak : వారణాసి కథ లీక్.. మహేష్ బాబు గ్లోబల్ వేట వెనుక అసలు రహస్యం ఇదేనా..?"

  5. "Chicken Egg Prices Hike : నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న చికెన్, గుడ్ల ధరలు!"

  6. "Airtel Recharge Offer : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే మరో నెల ఫ్రీ..!"

  7. "Ramayana Movie 5 days Collections : రూ.500 కోట్ల క్లబ్‌లోకి రామాయణ.. ఐదు రోజుల్లోనే బాక్సాఫీస్ సంచలనం!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp