Chiranjeevi : మెగా ఇమేజ్‌కు దెబ్బ.. అసలు ఇండస్ట్రీ పెద్ద దిక్కు చిరంజీవేనా?
Chiranjeevi : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మెగా క్యాంప్‌కు పెద్ద దెబ్బ పడ్డట్టు అయింది. మెగా అండదండలతో ప్రకాష్ రాజ్ బరిలోకి దిగాడు. అటు వైపు మంచు ఫ్యామిలీ రంగంలోకి దిగింది. ఇది ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు మధ్య పోటీ అయినా కూడా అంతర్గతంగా మాత్రం మంచు వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్నట్టు జరిగింది. అయితే ఇందులో చిరంజీవి ప్రత్యక్షంగా ఉన్నాడా? లేదా? అన్నది పక్కన పెడితే.. నాగబాబు మాత్రం దూకుడుగా వ్యవహరించాడు. మెగా మద్దతు ప్రకాష్ రాజ్‌కే ఉందని, ఎలా అయినా గెలిపించుకుంటామని ప్రగల్భాలు పలికాడు.
మంచు ఫ్యామిలీని నానా మాటలు అనేశాడు. చివరకు మంచు విష్ణు గెలిచింది. అయితే అలా మంచు విష్ణు గెలిచిన ప్రాంగణంలో జై జగన్ నినాదాలు వినిపించాయి. అంటే విష్ణు వెనకాల ఎవరు ఉన్నారు.. ఎవరు నడిపించారో అర్థమవుతుంది. ఎలా గెలిచాడన్నది ముఖ్యం కాకపోయినా కూడా గెలిచేశాడు. ఇండస్ట్రీలో ఇప్పటిరకు మెగా మ్యానియా ఉందని భ్రమపడ్డవారికి ఇది చుక్కెదురులాంటిది. మంచు వారి దెబ్బకు మెగా కుదేలైంది. అయితే ఇండస్ట్రీ పెద్దన్న, పెద్దదిక్కు అంటూ ఇన్ని రోజులు అందరూ చిరంజీవి వైపు చూశారు.
Chiranjeevi : చిరంజీవికి కోలుకోలేని దెబ్బ..
దాసరి స్థానంలో చిరంజీవిని అందరూ అంగీకరించినట్టు కనిపించారు. కానీ మోహన్ బాబు మాత్రం ఎప్పుడూ అలా ఒప్పుకోలేదు. మొత్తానికి ఇలా తన కొడుకును దగ్గరుండి గెలిపించుకుని తన సత్తా చాటాడు. చిరంజీవికి చెక్ పెట్టేశాడు. ప్రకాష్ రాజ్ ఓటమి చిరంజీవి ఇమేజ్‌కు మాయని మచ్చలా మారింది. తన అభ్యర్థినే గెలిపించుకోలేనోడు.. ఇండస్ట్రీ పెద్ద దిక్కు ఎలా అవుతాడు అంటూ ఎవ్వరైనా ప్రశ్నిస్తాడు. ఇకపై చిరును పెద్దదిక్కు అని ఎవ్వరూ అనకపోవచ్చు.