Chiranjeevi : ఒకే ఒక్క మాటతో చిరంజీవి కొంప ముంచేసిన గాడ్ ఫాదర్ నిర్మాత | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : ఒకే ఒక్క మాటతో చిరంజీవి కొంప ముంచేసిన గాడ్ ఫాదర్ నిర్మాత

 Authored By jagadesh | The Telugu News | Updated on :14 October 2022,8:30 pm

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు నెగెటివ్ టాక్ వచ్చినా.. విడుదల తర్వాత పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. గాడ్ ఫాదర్ సినిమా హిట్ టాక్ తో పాటు కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయని అందరూ చెప్పారు. దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా తొలి వారం బాగానే వసూళ్లు చేసిందన్నారు. కానీ.. ఆ తర్వాత సినిమా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. ఎందుకంటే..

రూ.90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన సినిమాకు ఇప్పటి వరకు వచ్చింది రూ.60 కోట్లు మాత్రమే. అంటే ఇంకా రూ.30 కోట్లు రావాలి. ఈ పరిస్థితుల్లో 30 కోట్లు రావాలంటే కష్టమే. అంటే.. కమర్షియల్ గా ఆలోచిస్తే ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పుకోవాలి. అందుకే సినిమా కలెక్షన్ల గురించి నిర్మాత ఎన్వీ ప్రసాద్ స్పష్టత ఇచ్చారు. అయితే.. సినిమాను తాము ఎవ్వరికీ అమ్మలేదు. సొంతంగా రిలీజ్ చేశాం. తెలుగు రాష్ట్రాల్లో మా సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. యూఎస్ లో అయితే ఒక మిలియన్ దాటేసింది ఇప్పటికే. ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతోంది.. అంటూ మీడియాకు రిలీజ్ చేసిన నోట్ లో నిర్మాత పేర్కొన్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. అసలు మీడియాకు రిలీజ్ చేసిన నోట్ లో చెప్పినట్టుగా..

Chiranjeevi Kompa is the producer of Godfather

Chiranjeevi Kompa is the producer of Godfather

Chiranjeevi : సినిమాను సొంతంగా రిలీజ్ చేశాం

ఇంతకుముందు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎందుకు సినిమాను సొంతంగా రిలీజ్ చేస్తున్నామని నిర్మాత చెప్పలేదు. ఇదే కాన్ఫిడెన్స్ అప్పుడు ఎందుకు లేదంటూ సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దానికి కారణం.. సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోవడమేనని అంటున్నారు. సొంతంగా సినిమాను రిలీజ్ చేయడం వల్ల.. బయ్యర్ల నుంచి ఎలాంటి రిస్క్ ఉండదు. కానీ.. సినిమా విడుదలకు ముందు తాము సొంతంగా విడుదల చేస్తున్నామని ఎందుకు మూవీ యూనిట్ చెప్పలేదు అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. దీన్ని బట్టి చూస్తే గాడ్ ఫాదర్ సినిమా ఏ రేంజ్ హిట్ అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి