Chiranjeevi Movies Bhola Shankar And Valther Veeraiah
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి పై అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, బోలా శంకర్, వాల్తేరు వీరన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు కనీసం వాటిని కూడా పూర్తి చేయలేదు. ఈ మూడు సినిమాలు కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా అలాగే మరో సినిమా కూడా చిరంజీవి మొదలు పెట్టాల్సి ఉంది. కానీ అవేవీ పట్టనట్టుగా ప్రస్తుతం చిరంజీవి బాలీవుడ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. చిరంజీవి లాల్ సింగ్ చడ్డా ని సమర్పిస్తున్న విషయం తెల్సిందే.
ఈ వారం విడుదల కాబోతున్న ఆ సినిమా కోసం ఆయన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి ఏమో కాని మన సినిమా ఎప్పుడు మెగాస్టార్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ రావడం పట్ల ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మెగా అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలు ఏమీ జరుగుతున్నట్లు గా లేదు. పూర్తిగా హిందీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిరంజీవి దృష్టి పెట్టాడు అంటూ మెగా కాంపౌండ్ సమాచారం అందుతోంది.
Chiranjeevi Movies Bhola Shankar And Valther Veeraiah
చిరంజీవి గాడ్ ఫాదర్ ఆగస్టులో వస్తుంది అంటూ మొన్నటి వరకు అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఆగస్టు వచ్చేసింది.. వెళ్ళిపోతుంది కూడా ఆయన ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు. వచ్చే నెలలో అయినా గాడ్ ఫాదర్ ఉంటుందా అంటున్నారు. గాడ్ ఫాదర్ సినిమాను కనీసం దసరా వరకు అయినా విడుదల చేయాలి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ తర్వాత భోళా శంకర్ మరియు వాల్తేరు వీరయ్య సినిమాలను కూడా విడుదల చేసి తదుపరి సినిమాల్లో బిజీ అవ్వాలని చిరంజీవి మెగా అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి అన్నయ్య సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాలో తన సినిమాలను చేస్తాడా అనేది చూడాలి.
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.