Chiranjeevi : పేరు మార్చుకున్న చిరంజీవి.. ఎందుకో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Published on: July 6, 2022, 6:30 pm

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అద్భుత‌మైన న‌ట‌న , స్టైలిష్ డ్యాన్స్‌తో కోట్లాది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ రారాజుగా వెలుగొందుతూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి పేరు మార్చుకున్నారా? అంటే అవుననక తప్పడం లేదు మరి. ఇందుకు పక్కా ప్రూఫ్ కూడా దొరకడంతో చిరంజీవి పేరు మార్పుకు సంబంధించిన పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటి? చిరంజీవి పేరు మార్చుకున్నారా? ఇందుకు సంబంధించిన వార్త‌లు ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చాయి అంటే దానికి కార‌ణం గాడ్ ఫాద‌ర్ మూవీ అప్‌డేట్ అని చెప్పాలి.

చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా గాడ్ ఫాదర్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియోలో చిరంజీవి పేరులో చిన్న మార్పు కనిపించడంతో ఒక్కసారిగా సినీ వర్గాల్లో ఇందుకు సంబంధించిన పలు చర్చలు మొదలయ్యాయి. గాడ్ ఫాదర్ టీజర్ లో EE కి బదులు అదనంగా మరో E పడటం కేవలం పొరపాటు మాత్రమే అని తెలిపారు చిత్ర యూనిట్. అంతేకానీ సోషల్ మీడియాలో వస్తున్నట్టు చిరంజీవి పేరు మార్చుకున్నాడు అనడంలో ఎలాంటి నిజం లేదని.. ఆ పొరపాటు వెంటనే సరిదిద్దుకున్నామని చెబుతున్నారు చిత్ర యూనిట్. సినిమాకి సంబంధించి సాంగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉండ‌గా, దాన్ని కూడా జులై 7 నుంచి షూట్ చేస్తున్నారు.

chiranjeevi name changed what is the reason

chiranjeevi name changed what is the reason

Chiranjeevi : త‌ప్పు స‌రిదిద్దుకున్నారు..

మరోవైపు తలకోనలో జరగబోయే చిన్న షెడ్యూల్లో చిరంజీవి కూడా పాల్గొంటారని తెలుస్తోంది. రాజకీయ ప్రయాణం అనంతరం తిరిగి సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహా రెడ్డి లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్నారు. ఈ సినిమాలు రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. కాకపోతే ఇటీవల తన కుమారుడితో కలిసి చేసిన ఆచార్య సినిమా మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు చిరు. వేదాళం తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అదేవిధంగా మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ లూసిఫర్ తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్, బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp