Mana Shankara Vara Prasad Garu Records : సీనియర్ హీరోల ఓపెనింగ్స్‌లో మెగాస్టార్ డామినేషన్… టాప్ రికార్డులన్నీ చిరంజీవి ఖాతాలోనే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mana Shankara Vara Prasad Garu Records : సీనియర్ హీరోల ఓపెనింగ్స్‌లో మెగాస్టార్ డామినేషన్… టాప్ రికార్డులన్నీ చిరంజీవి ఖాతాలోనే!

 Authored By ramu | The Telugu News | Updated on :15 January 2026,8:00 am

ప్రధానాంశాలు:

  •  Mana Shankara Vara Prasad Garu Records : సీనియర్ హీరోల ఓపెనింగ్స్‌లో మెగాస్టార్ డామినేషన్… టాప్ రికార్డులన్నీ చిరంజీవి ఖాతాలోనే!

Mana Shankara Vara Prasad Garu Records : టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ స్టార్స్ ఆరుగురు ఉండగా, సీనియర్ హీరోలుగా నలుగురు తమదైన స్థాయిలో బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసే సత్తా కలిగినవారే. టాప్ స్టార్స్‌లో ఎవరు ఎప్పుడు ఎలాంటి రికార్డులతో విరుచుకుపడతారో చెప్పలేని పరిస్థితి ఉన్నప్పటికీ, సీనియర్ హీరోల విషయంలో మాత్రం ముందునుంచి మెగాస్టార్ చిరంజీవి మాస్ రాంపేజ్ ఎక్కువగా కొనసాగుతూనే ఉంది. మధ్యలో కొంతకాలం ఫామ్ కోల్పోయిన నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపినా, ఎందుకో మెగాస్టార్ సినిమాల స్థాయిలో టోటల్ రన్, షేర్స్ పరంగా అందుకోలేకపోతున్నాడనే అభిప్రాయం వినిపిస్తోంది.

Mana Shankara Vara Prasad Garu Records సీనియర్ హీరోల ఓపెనింగ్స్‌లో మెగాస్టార్ డామినేషన్ టాప్ రికార్డులన్నీ చిరంజీవి ఖాతాలోనే

Mana Shankara Vara Prasad Garu Records : సీనియర్ హీరోల ఓపెనింగ్స్‌లో మెగాస్టార్ డామినేషన్… టాప్ రికార్డులన్నీ చిరంజీవి ఖాతాలోనే!

Mana Shankara Vara Prasad Garu Records మెగా హ‌వా…

మరోవైపు వెంకటేష్ గతేడాది సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మెగాస్టార్ సినిమాలకన్నా ఎక్కువ కలెక్షన్స్ సాధించి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ మాస్ రచ్చ చేస్తోంది. ఓపెనింగ్స్ విషయంలో మొదటినుంచే మెగాస్టార్ డామినేషన్ మరోసారి రుజువైంది. గతంలో ‘సైరా నరసింహా రెడ్డి’తో సంచలనం సృష్టించిన చిరంజీవి, ఇప్పుడు ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో మరోసారి చరిత్ర సృష్టించాడు. ఈ సినిమా మొదటి రోజే అంచనాలను మించి వసూళ్లు సాధించి, సీనియర్ హీరోల్లో ఆల్‌టైమ్ టాప్ 2 హైయెస్ట్ ఓపెనింగ్స్‌లో స్థానం దక్కించుకుంది. టాలీవుడ్ సీనియర్ హీరోల ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ గ్రాస్‌లను పరిశీలిస్తే, ‘సైరా నరసింహా రెడ్డి’ 85 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ 74.25 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది.

ఆ తర్వాత ‘ఆచార్య’ 52 కోట్లు, ‘డాకు మహారాజ్’ 51.85 కోట్లు, ‘ఖైదీ నంబర్ 150’ 50.50 కోట్లు, ‘వీరసింహారెడ్డి’ 50.10 కోట్లు, ‘వాల్తేరు వీరయ్య’ 49.10 కోట్లు, ‘అఖండ 2’ 48.85 కోట్లు, ‘సంక్రాంతికి వస్తున్నాం’ 40.05 కోట్లతో ఉన్నాయి. మొత్తం మీద టాప్ 3 సినిమాలు మెగాస్టార్ ఖాతాలోనే ఉండగా, టాప్ 5లో నాలుగు చిత్రాలతో చిరంజీవి మాస్ డామినేషన్ కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది. సీనియర్ హీరోల నలుగురిలో ముగ్గురి సినిమాలు ఈ లిస్టులో ఉండగా, కింగ్ నాగార్జున తన స్థాయికి తగ్గ భారీ సినిమాతో ఈ జాబితాలో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో చూడాల్సి ఉందనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది