Ram Charan : యంగ్ హీరోలను తండ్రీ కొడులుగా స్క్రీన్ మీద చూడాలంటే సగం మంది అభిమానులకు నచ్చే విషయం కాదనే చెప్పాలి. అలా నటించే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఆంధ్రావాలా సినిమాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఇదే సినిమాలో తండ్రి పాత్రకు అప్పట్లో ఉన్న సీనియర్ హీరోలు గనక చేసుంటే కనీసం హిట్ టాక్ అయినా తెచ్చుకునేది. దర్శకులు అభిమానులను దృష్ఠిలో పెట్టుకొని హీరోల పాత్రలను డిజైన్ చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఇవి బెడిసికొడుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధిస్తుందనుకున్న సినిమా డిజాస్టర్‌గా నిలుస్తోంది.
ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా విషయంలో కూడా ఇలాంటి టాక్ వినిపిస్తోంది. చరణ్ ఇప్పటి వరకు తండ్రీకొడుకులుగా నటించించింది లేదు. మొదటిసారి శంకర్ ఈ సాహసం చేస్తున్నాడు. ఆయన సినిమా అంటే గ్యారెంటీగా ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. హీరో పాత్ర, హీరోయిన్ పాత్ర అలాగే మిగతా పాత్రలు ఎంతో బలంగా ఉంటాయి. కథ, కథనాలు, మ్యూజిక్ ఇలాప్రతీది ఎంతో స్ట్రాంగ్‌గా డిజైన్ చేస్తాడు. కానీ, రోబో హిట్ సాధించినట్టుగా ఐ, రోబో 2.ఓ సాధించలేకపోయాయి.
ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ తన 15వ సినిమాను చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్‌కు పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ వచ్చింది. అయితే, ఆచార్య ఫ్లాప్ కాస్త మైనస్ అయిందని చెప్పక తప్పదు. ఇప్పుడు చరణ్ ఫోకస్ మొత్తం తన 15వ సినిమా మీదే ఉంది. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక చరణ్‌ను ఈ సినిమాలో శంకర్ తండ్రీకొడులుగా చూపించబోతున్నారు. ఇప్పటికే రెండు పాత్రలకు సంబంధించిన లుక్ కూడా వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ, అందరికీ ఉన్న పెద్దసందేహం..చరణ్‌ను ఇలా తండ్రీకొడులుగా చూసి అభిమానులు, ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారూ అని. చూడాలి మరి కథ ఎలా ఉందో.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.