Ram Charan : ఈ ఏజ్‌లో తండ్రీకొడులుగా అంటే ..పెద్ద సాహసమే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ram Charan : ఈ ఏజ్‌లో తండ్రీకొడులుగా అంటే ..పెద్ద సాహసమే..!

 Authored By govind | The Telugu News | Updated on :13 May 2022,8:30 pm

Ram Charan : యంగ్ హీరోలను తండ్రీ కొడులుగా స్క్రీన్ మీద చూడాలంటే సగం మంది అభిమానులకు నచ్చే విషయం కాదనే చెప్పాలి. అలా నటించే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఆంధ్రావాలా సినిమాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఇదే సినిమాలో తండ్రి పాత్రకు అప్పట్లో ఉన్న సీనియర్ హీరోలు గనక చేసుంటే కనీసం హిట్ టాక్ అయినా తెచ్చుకునేది. దర్శకులు అభిమానులను దృష్ఠిలో పెట్టుకొని హీరోల పాత్రలను డిజైన్ చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఇవి బెడిసికొడుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధిస్తుందనుకున్న సినిమా డిజాస్టర్‌గా నిలుస్తోంది.

ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా విషయంలో కూడా ఇలాంటి టాక్ వినిపిస్తోంది. చరణ్ ఇప్పటి వరకు తండ్రీకొడుకులుగా నటించించింది లేదు. మొదటిసారి శంకర్ ఈ సాహసం చేస్తున్నాడు. ఆయన సినిమా అంటే గ్యారెంటీగా ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. హీరో పాత్ర, హీరోయిన్ పాత్ర అలాగే మిగతా పాత్రలు ఎంతో బలంగా ఉంటాయి. కథ, కథనాలు, మ్యూజిక్ ఇలాప్రతీది ఎంతో స్ట్రాంగ్‌గా డిజైన్ చేస్తాడు. కానీ, రోబో హిట్ సాధించినట్టుగా ఐ, రోబో 2.ఓ సాధించలేకపోయాయి.

Chiranjeevi Ram Charan It was a big adventure

Chiranjeevi Ram Charan It was a big adventure

Ram Charan : అందరికీ ఉన్న పెద్ద సందేహం..

ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ తన 15వ సినిమాను చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్‌కు పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ వచ్చింది. అయితే, ఆచార్య ఫ్లాప్ కాస్త మైనస్ అయిందని చెప్పక తప్పదు. ఇప్పుడు చరణ్ ఫోకస్ మొత్తం తన 15వ సినిమా మీదే ఉంది. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక చరణ్‌ను ఈ సినిమాలో శంకర్ తండ్రీకొడులుగా చూపించబోతున్నారు. ఇప్పటికే రెండు పాత్రలకు సంబంధించిన లుక్ కూడా వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ, అందరికీ ఉన్న పెద్దసందేహం..చరణ్‌ను ఇలా తండ్రీకొడులుగా చూసి అభిమానులు, ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారూ అని. చూడాలి మరి కథ ఎలా ఉందో.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది