chiranjeevi silent punch
Chiranjeevi : ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి మధ్య ఆసక్తికర డిస్కషన్ నడిచిన విషయం తెలిసిందే. అక్కడి వారితో చిరంజీవి ఫొటోలు దిగుతుంటే, మెగాస్టార్ ఇలా చేస్తే నేను వెళ్లిపోతానని అన్నాడు. దాంతో చిరు సైలెంట్‌గా వచ్చి కూర్చున్నారు. తర్వాత గరికపాటి నరసింహరావు వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. గరికపాటి నరసింహరావు పేరు ప్రస్తావించకుండా ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటేనని స్పందించారు. దీనిపై బ్రహ్మణ సంఘాలు స్పందించాయి.ఇలా ఈ విషయం కొద్ది రోజుల పాటు చర్చనీయాంశంగా మారింది.
ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి గరికపాటి వ్యాఖ్యలపై తనదైన స్టైల్లో పంచ్ వేశారు. తాజాగా మెగాస్టార్ చిరు… ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు రాసిన `శూన్యం నుంచి శిఖరాగ్రాలకు` పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ జరిగింది. చిరంజీవిపై రాసిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయనేగెస్ట్ గా హాజరయ్యారు.అయితే ఈ సందర్భంగా స్టేజ్ పై ఉన్న చిరంజీవితో ఫోటోలు దిగేందుకు మహిళలు క్యూ కట్టారు.ఆ సమయంలో. చిరు ఇక్కడ వారే లేరు కదా… హమ్మయ్య అంటూ..పంచ్ వేశారు. దీంతో చిరంజీవి గరికపాటిపై పంచ్ వేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.అంతకుముందు మీడియా ఇంటరాక్షన్ లో గరికపాటి వివాదంపై చిరంజీవిని మీడియా ప్రముఖులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.
chiranjeevi silent punch
గరికపాటి నరసింహారావు పెద్దాయన, ఆయన వ్యాఖ్యలపై చర్చ అనవసరం అన్నారు మెగాస్టార్. ఆయన పెద్ద పండితుడు, మంచీ చెడులకు తారతమ్యం తెలిసినవారు అన్నారు. కాబట్టి ఈ వివాదం గురించి మాట్లాడవలసిన అవసరం లేదని చెప్పి తన హుందాతనం చాటుకున్నారు. పరోక్షంగా వివాదం మరింత పెద్దది చేసే ఆలోచన లేదని చెప్పకనే చెప్పారు మెగాస్టార్. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు మురళీమోహన్… ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దలు మరియు పాత్రికేయులు హాజరు కావడం జరిగింది. ఇక చిరు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.