Home » Entertainment » Chiranjeevi Varun Tej Multi Starer Movie Lucifer Remake
Entertainment

Chiranjeevi : చిరంజీవి, వరుణ్ తేజ్‌ల మల్టీస్టారర్‌గా..!

Authored By
vamana sai
The Telugu News | Updated on: June 5, 2021, 11:04 am
Advertisement

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్నారు. చరణ్ సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జంటగా చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. ఆయనకి జంటగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. దాదాపు 10 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిరు వరుసగా యంగ్ డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తున్నారు.

Advertisement

కాగా ఆచార్య తర్వాత మరో మూడు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టిన ఆయన నెక్స్ట్ సినిమాగా మలయాళ హిట్ సినిమా లూసీఫర్ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్‌, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ఆర్. బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన తాజా వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా మెగా మల్టీస్టారర్ గా తెరకెక్కనుందట.

chiranjeevi varun tej multi starer movie

Advertisement

Chiranjeevi : మెగా అభిమానుల్లో మాత్రం చాలా ఎగ్జైటింగ్ న్యూస్ అయిపోయింది.

కీలక పాత్ర కోసం మెగా వారసుడు వరుణ్ తేజ్‌ను తీసుకోనున్నారని తాజా సమాచారం. విదేశాల నుంచి ఇండియాకి తిరిగి వచ్చి సీఎం పదవికి పోటీ చేసే పాత్రలో వరుణ్ తేజ్ కనిపించనున్నట్టు ఒక వార్త వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని మెగా అభిమానుల్లో మాత్రం చాలా ఎగ్జైటింగ్ న్యూస్ అయిపోయింది. ఇప్పటికే ఆచార్య చరణ్ చిరుతో స్క్రీన్ షేర్ చేసుకుంటుండగా త్వరలో మొదలవబోయో లూసీఫర్ రీమేక్‌లో వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో. ఇక ఈ సినిమాను మెగాస్టార్ బర్త్ డే అయిన ఆగస్టు 22న సెట్స్ మీదకి తీసుకు వచ్చే ప్లాన్ చేస్తున్నారట.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి