YS Jagan : వైఎస్ జగన్.. చాలా స్ట్రయిట్ ఫార్వార్డ్, చాలా రిజర్వ్ డ్. ఆయన తక్కువ మాట్లాడుతారు.. ఎక్కువ పనిచేస్తారు. అందుకే.. ఆయన ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎలాంటి పరిపాలనా అనుభవం లేకున్నా.. ఏపీని ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేయడంలో వైఎస్ జగన్ సఫలం అయ్యారు. అది వైఎస్ జగన్ కు ఉన్న టాలెంట్. ఆయన ఎంత తక్కువ మాట్లాడినా.. దాంట్లో ఉండే అర్థం మాత్రం కరెక్ట్ గా అందరికీ తెలిసిపోతుంది. ఆయన చెప్పాలనుకున్నదేదో.. డైరెక్ట్ గా చెప్పేస్తారు. అది పార్టీ అయినా.. ప్రభుత్వం అయినా. పార్టీని కూడా బలోపేతం చేసేందుకు సీఎం జగన్ మరోసారి నడుం బిగించారు. మరో మూడేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే.. ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు సీఎం జగన్.
వచ్చే ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీ పార్టీ విజయకేతనం ఎగురవేయాలంటే ఖచ్చితంగా సీఎం జగన్ పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి సీఎం జగన్ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంటున్నారని తెలుస్తోంది. ఎందుకంటే.. వైఎస్సార్సీపీని ఎదుర్కునేందుకు.. ఏపీలో ఉన్న మిగితా పార్టీలు అన్నీ ఏకమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు ఏకమైతే.. వైఎస్సార్సీపీకి గెలుపు కష్టం అవుతుందని.. మహా కూటమిని ఓడించడానికి సీఎం జగన్ ఇంకా తీవ్రంగా ప్రయత్నించాల్సి ఉంటుందని.. అందుకే.. జగన్ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది.
మహాకూటమిని తట్టుకొని.. మరోసారి అధికారంలోకి రావాలంటే.. సీఎం జగన్.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదట. దాని కోసం ముందు వైసీపీ పార్టీలో ప్రక్షాళన చేపట్టాలని జగన్ భావిస్తున్నారట. ఇప్పటికే వైసీపీ పార్టీలో యువ రక్తం పొంగుతోంది. మంత్రివర్గంలోనూ ఎక్కువగా యూత్ కే అవకాశం ఇచ్చారు. వాళ్ల పనితీరును కూడా ప్రజలు మెచ్చుకుంటున్నారు. అయితే.. పార్టీ సీనియర్ నేతలు, వయసు మళ్లిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. వాళ్లకు అనారోగ్యమే పెద్ద మైనస్. కొందరు వివాదస్పద నేతలు కూడా ఉన్నారు. వీళ్లందరి వల్ల పార్టీకి వచ్చే లాభం అయితే ఏం లేదట. కానీ.. పార్టీకే వీళ్ల వల్ల ఒకింత నష్టమేనట. అందుకే.. ఇటువంటి నేతలను పార్టీ నుంచి తొలగించడమే కరెక్ట్ అనే భావనలో సీఎం జగన్ ఉన్నారట. సీనియర్లను పక్కన పెట్టడంతో పాటు.. వాళ్ల స్థానంలో యూత్ కు అవకాశాలు ఇచ్చి.. వాళ్ల కొత్త ఆలోచనలతో వైసీపీని బలోపేతం చేయాలన్నదే సీఎం జగన్ ప్లాన్ అట. మొత్తానికి 2024 లో మహా కూటమిని ఎదుర్కోవడం కోసం సీఎం జగన్ ఇంకా ఎన్ని వ్యూహాలను పన్నుతారో వేచి చూడాల్సిందే.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.