Ali : ‘యమలీల’కు ఆలీ రెమ్యూనరేషన్.. ఆ రోజుల్లోనే అంత ఎమౌంటా?
Ali : యమలీల సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఒక సంచలనాన్ని సృష్టించింది. ఆ కథను ఎస్వీ కృష్టారెడ్డి మహేష్ బాబు కోసం రాసుకున్నట్టు.. కృష్ణకు చెబితే.. ఇంకా చిన్నపిల్లవాడే ఈ కథ వద్దు అని అన్నాడట. ఆ తరువాత దర్శకుడు ఆలీని హీరోగా ఫిక్స్ అయ్యాడట. ఆలీ హీరో అని చెప్పడంతో సౌందర్య నో అని చెప్పేసింది. అలా మొత్తానికి సౌందర్య ఓ మంచి సినిమాను వదులుకున్నట్టు అయింది. అలా సౌందర్య వదులుకుంది కాబట్టే ఇంద్రజ ఎంట్రీ జరిగింది.
అలా మొత్తానికి యమలీల సినిమాలో ఎన్నో విశేషాలున్నాయి. ఈ చిత్రం వసూళ్లు, రికార్డులు చూసి పెద్ద హీరోలు సైతం షాక్ అయ్యారు. ఆలీ నటనను చూసి అందరూ ఫిదా అయ్యారు. అలా యమలీల సినిమా ఆలీ జీవితాన్ని మలుపుతిప్పేసింది. ఆ సినిమా చూసిన తరువాత ఆలీ నాన్న కూడా.. ఏరా ఆలీ పిలవడం మానేసి.. ఆలీ గారు అని అనడం ప్రారంభించారట. బయట అందరూ అలానే పిలుస్తున్నారు కదా అందుకే నేను కూడా అలానే పిలుస్తున్నాను అని తన తండ్రి అన్నట్టు ఆలీ చెప్పుకొచ్చాడు.
Ali : ‘యమలీల’కు ఆలీ రెమ్యూనరేషన్
అయితే అలాంటి యమలీల సినిమా విడుదలై 27 ఏళ్లు అవుతోంది. దీనిపై శ్రీదేవీ డ్రామా కంపెనీ ఓ స్పెషల్ షో చేసింది. దీంట్లో ఆలీగా నరేష్ నటించాడు. తనకు వచ్చిన రెమ్యూనరేషన్ గురించి చెప్పేశాడు. పది వేలు ఇచ్చారని తెలుస్తోంది. ఆ సమయంలో అది చాలా ఎక్కువ. హీరోలకు ఇచ్చే రెమ్యూనరేషన్ నాకు ఎందుకు ఇస్తున్నారు అని అడిగాడట. చెక్కు చూశాక ఏమనిపిస్తోందంటే.. జీరోలు ఎక్కువ ఉన్నాయని అన్నాడట. మొత్తానికి ఆలీ మాత్రం మొదటిసారిగా అంత మొత్తంలో రెమ్యూనరేషన్ చూశానని ఆ మధ్య కొన్ని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.