Harsha Vardhan : మందు తాగే వారికి మస్త్ సలహా.. హీరో తండ్రి నేర్పించాడంటూ కమెడీయన్ స్టన్నింగ్ కామెంట్స్..!
ప్రధానాంశాలు:
Harsha Vardhan : మందు తాగే వారికి మస్త్ సలహా.. హీరో తండ్రి నేర్పించాడంటూ కమెడీయన్ స్టన్నింగ్ కామెంట్స్..!
Harsha Vardhan : తెలుగు ప్రేక్షకులకు హర్షవర్ధన్ అంటే కేవలం నటుడు మాత్రమే కాదు.. ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. బుల్లితెరపై అమృతం సీరియల్ తో ఇంటింటా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తన సహజమైన కామెడీ టైమింగ్‌తో అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా అలరించారు. గుండు హనుమంతరావుతో కలిసి చేసిన సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోయాయి. ఆ తర్వాత శాంతి నివాసం, కస్తూరి, ఋతురాగాలు వంటి సీరియల్స్‌తో టీవీ ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యారు. టెలివిజన్‌లో సెట్ అయిన తరువాత వెండితెరపై అడుగుపెట్టిన హర్షవర్ధన్, తనదైన నటనతో సినిమాల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
Harsha Vardhan : మందు తాగే వారికి మస్త్ సలహా.. హీరో తండ్రి నేర్పించాడంటూ కమెడీయన్ స్టన్నింగ్ కామెంట్స్..!
Harsha Vardhan ఇలా చేయండి..
సినిమాల్లో నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా కూడా తన ప్రతిభను చూపించారు హర్షవర్ధన్. గుండె జారి గల్లంతయ్యిందే, మనం, చిన్నదాన నీకోసం వంటి సినిమాలకు సంభాషణలు రాసి ప్రశంసలు అందుకున్నారు. రాఖీ, స్టాలిన్, లీడర్, గబ్బర్ సింగ్, గోల్కొండ హైస్కూల్, ఊపిరి, బ్రోచేవారెవరురా, హిట్–ది సెకండ్ కేస్ వంటి ఎన్నో చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. మధ్యలో కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైనా, ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో బిజీగా మారారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవర ప్రసాద్ గారు’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించి మరోసారి తన నటనా సత్తాను చాటుకున్నారు.
ఈ సినిమా విజయం నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ తన సినీ ప్రయాణంతో పాటు వ్యక్తిగత అలవాట్ల గురించి కూడా మాట్లాడారు. ముఖ్యంగా మద్యం సేవించే వారికి ఉపయోగపడే ఒక చిన్న కానీ విలువైన హెల్త్ టిప్ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “ఒక పెగ్గు తాగిన తర్వాత తప్పకుండా ఒక గ్లాస్ నీళ్లు తాగాలి. ప్రతి పెగ్గుకు నీళ్లు తాగితే శరీరంపై మద్యం ప్రభావం కొంతవరకు తగ్గుతుంది” అని ఆయన తెలిపారు. ఈ అలవాటు తనకు హీరో నితిన్ తండ్రి, ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిందని కూడా వెల్లడించారు. డ్రింక్ చేయడానికి ముందు అర లీటర్ నీళ్లు తాగితే ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చని ఆయన చెప్పిన సలహా తన జీవితంలో ఎంతో ఉపయోగపడిందని హర్షవర్ధన్ అన్నారు. హర్షవర్ధన్ చేసిన ఈ వ్యాఖ్యలకు నెట్టింట మంచి స్పందన వస్తోంది. “డ్రింక్ చేసినా జాగ్రత్తలు తప్పనిసరి”, “ఇలాంటి చిన్న సలహాలు ఎంతో మందికి ఉపయోగపడతాయి” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నటనతో పాటు జీవనశైలిపై కూడా అవగాహన కల్పిస్తున్న హర్షవర్ధన్ మాటలు, ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.