Comedian Saddam : మల్లెమాల, జబర్దస్త్ షోలు వల్లే అగ్రిమెంట్ల గురించి ఎక్కువగా తెలిసి వచ్చింది. మరీ ముఖ్యంగా అవినాష్ బిగ్ బాస్ ఎంట్రీ సమయంలోనే ఈ అగ్రిమెంట్ల తీరుపై ఎక్కువగా వ్యతిరేకత వచ్చింది. అగ్రిమెంట్ల పేరిట ఆర్టిస్టులను కట్టు బానిసల్లా మార్చేస్తున్నారని, హింసిస్తున్నారని కౌంటర్లు పడ్డాయి. మా దాంట్లో చేస్తే.. ఇంకెక్కడా చేయకూడదు.. ఇంక వేరే చానెల్‌లో కనిపించకూడదు అని ఇలా అగ్రిమెంట్లు ఉంటాయి. అయితే ఈ విషయంలో కొంత పాజిటివిటీ ఉంటే.. ఎంతో నెగెటివిటీ ఉంది. అలా జబర్దస్త్ షో, మల్లెమాల అగ్రిమెంట్ల మీద మాత్రం ఫుల్ నెగెటివిటీ ఏర్పడింది. అవినాష్ పది లక్షలు కట్టి మరీ బయటకు వచ్చాడు.
ఆ అగ్రిమెంట్లను తెంచుకున్నాడు. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాడు. ఇంకా చాలా మంది అగ్రిమెంట్లలోనే చిక్కుకుని అక్కడే ఉండిపోయారు. ఇక ఈ అగ్రిమెంట్ల మీద నాగబాబు ఎన్నో సెటైర్లు వేశాడు. అదిరింది బొమ్మ అదిరింది షోలో సద్దాం కూడా కౌంటర్లు వేశాడు. అలా అందరూ మరిచిపోయిన అగ్రిమెంట్ల మీద మళ్లీ ఇప్పుడు సద్దాం కౌంటర్లు వేశాడు. జీ తెలుగులో బోనాల జాతర అనే ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇందులో సీరియల్ తారలంతా కూడా వచ్చారు. శ్రీముఖి హోస్టింగ్ చేసింది. అయితే ఈ ప్రోమోలో సద్దాం రెచ్చిపోయాడు. యూట్యూబర్ నిఖిల్ గ్యాంగ్ వచ్చింది. నిఖిల్‌ను డ్యాన్స్ వేయమని శ్రీముఖి కోరింది. దీంతో వెంటనే సద్దాం కౌంటర్లు వేశాడు.
అతను ఎక్కడా డ్యాన్స్ వేయకూడదని అగ్రిమెంట్ ఉందని సద్దాం సెటైర్ వేస్తాడు. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తుంటారు. అయితే సద్దాం ఎవరి మీద కౌంటర్లు వేశాడు? అన్నది క్లారిటీ లేదు. మల్లెమాల మాత్రమే ఇలాంటి అగ్రిమెంట్లు పెడుతుంది కాబట్టి.. వారినే అని ఉంటాడని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. సద్దాం వేసిన కౌంటర్లు మల్లెమాలకు తగులుతాయ్.. ఎందుకంటే వారే ఇలా కట్టడి చేస్తుంటారని నెటిజన్లు కూడా అంటున్నారు. ఇక ఈ ఈవెంట్‌లో సీతారామం టీం సందడి చేసింది. దుల్కర్ సల్మాన్, సుమంత్ వంటి వారు వచ్చి ఎంజాయ్ చేశారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.