comedy actor Rajendra Prasad removed by director vamshi in his movie
Rajendra Prasad : నటకిరీటీ రాజేంద్రప్రసాద్ గురించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంట.. ఆయన నటనకు, కామెడీ టైమింగ్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎలాంటి పాత్రలోనైనా ఇమిడిపోయే విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్. కెరీర్ మొదట్లో కొన్ని నెగెటివ్ రోల్స్ చేసిన రాజేంద్రుడు.. ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా సెటిల్ అయ్యాడు.తన హీరోయిజానికి కామెడీని జోడించి ఎవరికీ సాధ్యం కాని కొత్త హీరోయిజాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. రాజేంద్రుడి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే స్థాయికి తీసుకెళ్లాడు.
ఇక రాజేంద్ర ప్రసాద్ డైరెక్టర్ వంశీతో ఒక సినిమాను కమిట్ అయ్యాడు.ఇందులో హీరోయిన్ విషయంలో ప్రస్తావన రాగా భానుప్రియ సోదరి నిశాంతిని డైరెక్టర్ ఫైనల్ చేశారట.. అయితే, ఆమె తనకు నచ్చలేదని.. ఆమెను మారిస్తేనే సినిమా చేస్తానంటూ రాజేంద్రప్రసాద్ ప్రతిరోజూ దర్శకుడితో వాదించేవాడట..ఇలా చాలా రోజులు చెప్పి చూసిన డైరెక్టర్ వంశీ తీరా ఒకరోజు ఏకంగా నటకిరీటీకే షాకిచ్చాడని ఇండస్ట్రీ వర్గాల్లో అప్పట్లో పెనుదూమారం రేపింది. సినిమా పేరును కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ ఒకటి ఎంచుకోవడంతో పాటు రాజేంద్ర ప్రసాద్‌కు జోడిగా నిషాంతిని ఫిక్స్ చేసినట్టు ముందే ప్రకటించారట..తీరా హీరో హీరోయిన్‌ను మార్చాలని చెప్పడం దర్శకుడికి ఏమాత్రం నచ్చలేదట..దీంతో ఓ రోజు ఏకంగా రాజేంద్రప్రసాద్, హీరోయన్ నిశాంతి ఇద్దరినీ ఈ ప్రాజెక్టు నుంచి తొలగించారట.. ఆ తర్వాత మరో కామెడీ స్టార్ నరేష్‌ను హీరోగా ప్రకటించారని తెలిసింది.
comedy actor Rajendra Prasad removed by director vamshi in his movie
ఈ క్రమంలోనే హీరోయిన్ కోసం వంశీ వెతుకుతుండగా.. మద్రాస్‌లో ఓ సినిమా పోస్టర్ చూసి ఏవీఎం స్టూడియోకు వెళ్లాడు. అక్కడ పోస్టర్‌లో ఉన్న అమ్మాయి బ్లాక్ కళ్లజోడు పెట్టుకుని వంశీని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె కళ్లు వంశీకి చాలా నచ్చడంతో ఎంక్వైరీ చేయగా..ఆమెది రాజమండ్రే అని తేలింది. అచ్చం తెలుగమ్మాయిలా ఉన్న ఆమె పేరు మాధురి. అందులోనూ గోదారి పక్కన రాజమండ్రి అమ్మాయి అంటే వంశీ ఎందుకు వదులుకుంటాడు? ఆమెనే ఫిక్స్ చేసి ఫొటో సెషన్స్ పెట్టించి మరీ హీరోయిన్‌గా బుక్ చేసి అడ్వాన్స్ కూడా ఇప్పించేశాడట. రాజేంద్రప్రసాద్ అత్యుత్సాహం వల్లే వంశీ ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకున్నాడట.. తీరా సినిమా రిలీజ్ అయ్యాక బంపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఈ సినిమాలో విషయంలో నటకిరిటీ బాధపడ్డారని సన్నిహితులు పేర్కొన్నారు.
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
This website uses cookies.