Johnny Master : జానీ మాస్ట‌ర్ అక్ర‌మాల గురించి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి కొరియ‌ర్.. అందులో ఏముంది అంటే..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 23 June 2024, 9:00 am

Johnny Master : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ప‌నులు మొద‌లు పెట్టాడు. అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతూ అన్ని విష‌యాలు అడిగి తెల‌సుకుంటున్నాడు. ఆయ‌న‌కి కొంద‌రు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఈ క్ర‌మంలో జానీ మాస్ట‌ర్ గురించి ఓ వ్య‌క్తి ఫిర్యాదు చేయ‌డం చర్చ‌నీయాంశం అయింది. ప్రముఖ సినిమా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు తెలియని వాళ్లు ఉండరు.. ఈయన ఇండస్ట్రీలోని స్టార్ హీరోల చేత స్టెప్పులు వేయించాడు.. ప్రస్తుతం సినిమాలను చేస్తూనే మరోవైపు బుల్లి తెరపై ప్రసారం అవుతున్న ప్రముఖ డ్యాన్స్ షో ఢీ లో జడ్జిగా వ్యవహారిస్తున్నారు..

Johnny Master ఫిర్యాదుల వెల్లువ‌..

జానీ మాస్ట‌ర్‌ పై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.. జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.. మరి దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటాడా అనేది ఆసక్తిగా మారింది.. డ్యాన్సర్ సతీష్ మాస్టర్ పై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.. ఈ నెల 5 న కూడా సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఆ ఫిర్యాదులో జానీ మాస్టర్ అతన్ని షూటింగ్ లకు పిలవద్దని యూనిట్ కు ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు సతీష్ పోలీసుల ఫోర్యాదులో పేర్కొన్నాడు.. అతను డ్యాన్స్ ను జీవితంగా భావిస్తున్నాను.. ఇప్పుడు మాస్టర్ నా కేరీర్ ను నాశనం చేస్తున్నాడని పోలీసుల ముందు వాపోయినట్లు స‌మాచారం.

Johnny Master : జానీ మాస్ట‌ర్ అక్ర‌మాల గురించి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి కొరియ‌ర్.. అందులో ఏముంది అంటే..!

Johnny Master : జానీ మాస్ట‌ర్ అక్ర‌మాల గురించి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి కొరియ‌ర్.. అందులో ఏముంది అంటే..!

జానీ మాస్ట‌ర్‌పై చేసిన కంప్లైంట్ విష‌యంలో పోలీసులు స‌రిగ్గా స్పందించ‌క‌పోవ‌డం ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ ప‌వ‌న్‌కి కంప్లైట్ చేశాడ‌ని టాక్. తెలుగు ఫిల్మ్ అండ్‌ టీవీ డాన్సర్స్ అండ్‌ డాన్స్‌ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి జానీ మాస్టర్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. జానీ మాస్టర్‌ జనసేన పార్టీలో చేరి ఇటీవల అగ్రెసివ్‌గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. అంతేకాదు ఎమ్మెల్యే పదవి కోసం టికెట్ కూడా ఆశించాడు. కూటమి సర్దుబాటులో భాగంగా ఆయనకు టికెట్‌ రాలేదు. కానీ జనసేన నాయకుడిగా కొనసాగుతున్నారు. మరి జానీ మాస్టర్‌ పై వచ్చిన ఫిర్యాదుని పవన్‌ కళ్యాణ్ ఏ ర‌కంగా సాల్వ్ చేస్తాడో చూడాలి.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి