Conductor Jhansi : సోషల్ మీడియాలో ముఖ్యంగా షార్ట్ వీడియోస్ ఎక్కడ చూసినా కూడా కండక్టర్ ఝాన్సీ కనిపిస్తుంది. ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీలో వేసిన పల్సర్ బండి పాట స్టెప్పులు మరియు గతంలో రికార్డింగ్ ట్రూప్ లో ఆమె వేసిన పాటలకు సంబంధించిన స్టెప్పులు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమె పల్సర్ బండి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ముందు చాలా తక్కువ మందికి మాత్రమే కండక్టర్ ఝాన్సీ గురించి తెలుసు. గాజువాక ఆర్టీసీ బస్ డిపోలో కండక్టర్ గా చేస్తున్న ఝాన్సీ శ్రీదేవి డ్రామా కంపెనీలో వేసిన స్టెప్పులకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో ఆమె ఓవర్ నైట్ లో స్టార్ట్ అయిపోయింది.
శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కనిపించడానికి ముందు ఝాన్సీ ఏదైనా రికార్డింగ్ ట్రూప్ డాన్స్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు రోజుకు మూడు నుండి అయిదు వేల రూపాయలను పారితోషికంగా తీసుకునేదట. అంతకు ముందు అయిదు వందలు మరియు వెయ్యి రూపాయలు తీసుకున్న సందర్భం కూడా ఉన్నదని ఝాన్సీ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు ఆమె పారితోషికం రోజుకి 50,000 అన్నట్లుగా నడుస్తుందట. ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా.. ఏదైనా డాన్స్ కార్యక్రమానికి వెళ్లాలన్నా.. ఎక్కడైనా ఆమె కనిపించాలన్నా భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా ఆమె ప్రస్తుతానికి తన ఉద్యోగానికి కూడా దూరంగా ఉంటుందట. లాంగ్ లీవ్ పెట్టిన కండక్టర్ ఝాన్సీ పూర్తిగా డాన్స్ పై దృష్టి పెట్టింది. కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రమే కాకుండా పలు ఎంటర్టైన్మెంట్ చానల్స్ కూడా ఇప్పుడు ఆమెను ఆహ్వానిస్తున్నాయి. దాంతో వరుసగా ఆమెకు ఆఫర్లు వచ్చి పడుతుండడంతో పారితోషికం కూడా భారీగా పెంచినట్లుగా తెలుస్తోంది.
ఆమె కెరియర్ ఆరంభించినప్పటి నుండి సంపాదించిన మొత్తం కేవలం ఈ నెల రోజుల్లోనే సంపాదించింది అంటే ఆమె ఏ స్థాయిలో బిజీగా ఉందో.. ఆమెకు ఏ స్థాయిలో క్రేజ్ దక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఆమెకి ప్రస్తుతం ఉన్న క్రేజ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా భారీ పారితోషికంను ఇచ్చి మరీ తమ డాన్సింగ్ ట్రూప్ లో చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు కండక్టర్ ఝాన్సీ అంటే గాజువాక చుట్టు పక్కల ప్రాంతాల వారికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు కండక్టర్ ఝాన్సీ తెలుగు రాష్ట్రాలతో పాటు.. తెలుగు వారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా అందరికీ సుపరిచితురాలు అయ్యింది. అందుకే ఆమెకు భారీ ఎత్తున పారితోషికం దక్కుతుంది. విదేశాల్లో కూడా ఆమెకు అభిమానులు పెరగడంతో త్వరలో ఆమె అక్కడికి కూడా వెళ్లి పర్ఫామెన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్‌లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.