Chiranjeevi : బ్రేకింగ్ చిరంజీవికి కరోనా పాజిటివ్
Chiranjeevi : తెలుగు సినిమా పరిశ్రమతో పాటుగా తెలుగు రాజకీయాలను కూడా కరోనా వదలడం లేదు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా సినీ హీరో మహేష్ బాబుకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా తనకు కరోనా పాజిటివ్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. తాను హోం క్వారంటైన్ లో ఉన్నాను అని చెప్పిన చిరంజీవి తనను కలిసిన వాళ్ళు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఇక తనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని ఆందోళన అవసరం లేదన్నారు చిరంజీవి.
corona positive for chirnjeevi
రెండో వేవ్ సమయంలో పలువురు సినీ నటులకు కరోనా సోకగా మూడో వేవ్ టైం లో కూడా మరికొందరు సినీ నటులు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం కరోనా కేసులు దేశ వ్యాప్తంగా ఉండటం, ఓమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అవుతున్నాయి.
