Samantha : రాజ్ నిడిమోరుతో అఫీషియ‌ల్ రిలేష‌న్.. త్వ‌ర‌లోనే స‌మంత రెండో పెళ్లి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : రాజ్ నిడిమోరుతో అఫీషియ‌ల్ రిలేష‌న్.. త్వ‌ర‌లోనే స‌మంత రెండో పెళ్లి

 Authored By ramu | The Telugu News | Updated on :2 July 2025,2:05 pm

ప్రధానాంశాలు:

  •  Samantha : రాజ్ నిడిమోరుతో అఫీషియ‌ల్ రిలేష‌న్.. త్వ‌ర‌లోనే స‌మంత రెండో పెళ్లి

Samantha : టాలీవుడ్‌ టాప్ హీరోయిన్ సమంత సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకున్నా, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపిస్తుంటుంది. రెగ్యులర్‌గా తన వర్కవుట్స్, ఫిట్‌నెస్ రూటీన్, మోటివేషన్ వీడియోలు, ఫోటోలు పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది.

Samantha రాజ్ నిడిమోరుతో అఫీషియ‌ల్ రిలేష‌న్ త్వ‌ర‌లోనే స‌మంత రెండో పెళ్లి

Samantha : రాజ్ నిడిమోరుతో అఫీషియ‌ల్ రిలేష‌న్.. త్వ‌ర‌లోనే స‌మంత రెండో పెళ్లి

Samantha : త్వ‌ర‌లోనే క్లారిటీ..

సమంత – దర్శకుడు రాజ్ నిడిమోరు మధ్య పెరుగుతున్న క్లోజ్ నెస్ ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సిటాడెల్, ది ఫ్యామిలీ మేన్ వంటి వెబ్ సిరీస్‌లను డైరెక్ట్ చేసిన రాజ్‌తో సమంత గత కొన్ని నెలలుగా అత్యంత దగ్గరగా ఉంటోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలిసి వెళ్లడం, ‘శుభం’ సినిమా విజయోత్సవ వేడుకల్లో సమంత పక్కనే రాజ్ కనిపించడం ఇవన్నీ ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి.

వీరి మధ్య సంబంధంపై వచ్చిన పుకార్లను ఇద్దరూ కొంతమేర ఖండించినా, రాజ్ భార్య తరచూ “నమ్మకం, ప్రేమ, రిలేషన్‌షిప్” వంటి విషయాలపై షేర్ చేస్తున్న పోస్టులు మరింత అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాదిలోనే తమ బంధాన్ని సమంత – రాజ్‌లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్న టాక్ ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. నిజం ఏమిటో మాత్రం తెలియాలంటే మరో కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది