Daku Maharaj Movie : రాజ్యం లేని రాజు.. డాకూ మహారాజ్.. అదిరిన బాలయ్య మూవీ టీజర్..!
Daku Maharaj Movie : హీరో బాలకృష్ణ Balakrishna , డైరెక్టర్ బాబీ Babi దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఓ మూవీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మూవీకి ‘డాకు మహారాజ్’ గా పేరు పెట్టారు. దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ‘ఈ కథ వెలుగును పంచే దేవుళ్లది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రావణుడిదీ కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది.
మరణాన్నే వణికించిన మహారాజుది’ అనే డైలాగ్స్‌తో టీజర్ ఉంది. ‘గుర్తుపట్టావా.. డాకు మహారాజ్’ అంటూ బాలయ్య మార్క్ డైలాగ్స్, విజువల్స్ ఈలలు వేయించేలా ఉన్నాయి. బాలయ్య బాబు మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ మధ్య తను పట్టిందల్లా బంగారం అవుతుంది. వరుసగా బాక్సాఫీస్ హిట్స్ అందుకుంటున్నారు. ఈ సంక్రాంతి బరిలో గెలుపు పుంజులా నిలబడ్డాడు. దర్శకుడు బాబీ సైతం వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకొని స్టార్ డైరెక్టర్ గా క్రేజ్ అందుకున్నాడు. థమన్ కాంబినేషన్ కూడా ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. బీజీఎంకు గుస్‌బంప్సే. బాలయ్య లుక్ సైతం మెస్మరైజింగ్ ఉంది.
Daku Maharaj Movie : రాజ్యం లేని రాజు.. డాకూ మహారాజ్.. అదిరిన బాలయ్య మూవీ టీజర్..!
ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, నిరంజన్ దేవరమానే ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ – ఫార్చూన్ ఫోర్ ప్రొడక్షన్ లలో సంయుక్తంగా నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇదిరా టీజర్ అంటే.. ఇదిరా బీజీఎం అంటే.. ఇదిరా బాలయ్య అంటే.. జై బాలయ్య అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ అభిమానులు ఉప్పొంగిపోతూ తమ హర్షాతిరేకాలు పంచుకుంటున్నారు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.