Sudihali Sudheer : పిలవకపోయినా ఇంటికి వస్తావ్.. సుధీర్ గుట్టు విప్పిన దీపిక పిల్లి.. వైరల్ వీడియో !
Sudihali Sudheer ఢీ షో అంటే డ్యాన్సులు తక్కువ కామెడీకి ఎక్కువన్న సంగతి తెలిసిందే. అసలు ఒకప్పుడు డీ షో స్వరూపమే వేరు. ఇప్పుడు వస్తున్న ఢీ షో వేరు. ఇందులో డ్యాన్సులు డ్యాన్సల్లా ఉండవు. జబర్దస్త్ షోకు తక్కువ డ్యాన్స్ షోలకు ఎక్కువన్నట్టుంది. రష్మీ, సుధీర్, ప్రదీప్, దీపిక, ఆది ఇలా వీరితో పాటు పూర్ణ, ప్రియమణి చేసే అతి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
పిలవకపోయినా ఇంటికి వస్తావ్.. సుధీర్ గుట్టు విప్పిన దీపిక పిల్లి Sudihali Sudheer
ఇక వచ్చ వారం ప్రసారం కానున్న ఢీ షోకు సంబంధించిన ప్రోమోను వదిలారు. ప్రతీ వారం ఒక్కో కాన్సెప్ట్‌తో వస్తోన్న ఢీ టీం.. వచ్చే వారం విలేజ్ గెటప్‌లతో వచ్చారు. ఇందులో పూర్ణ,ప్రియమణి, గణేష్ మాస్టర్‌లు విలేజ్ గెటప్‌లు వేసుకున్నారు. ఇక రష్మీ, దీపిక గ్రామీణ అమ్మాయిలుగానే రెడీ అయ్యారు. పాత కాలం సినిమాల్లోని ఊరి ప్రెసిడెంట్‌లా సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు.
పంపుసెట్లు, గడ్డివాము, ఊరి చివర గుడిసెలు అంటూ ఆదికి అలవాటైన పంచులు సుధీర్ మీద వేశాడు. ఇక ఊర్లోకి ప్రదీప్ కొత్తగా వచ్చిన యువకుడిలా ఎంట్రీ ఇచ్చారు. మా ఇంటికి రా అని దీపిక వయ్యారంగా పిలుస్తుంది. నన్ను ఎప్పుడైనా అలా పిలిచారా? అని దీపికను సుధీర్ అడుగుతాడు. నువ్ పిలవకపోయినా వస్తావ్ కదా? అని దీపిక అనడంతో రష్మీ దెబ్బకు నోరెళ్లబెట్టేసింది.
