Home » Entertainment » Deepika Pilli Shares Funny Incident With Fans
Entertainment

Deepika Pilli : ఆ పని చేస్తే ఎంత నొప్పిగా ఉంటుందో తెలుసా?.. వామ్మో దీపికా పిల్లి మహా నాటు

Authored By
aruna
The Telugu News | Published on: August 10, 2022, 11:30 am
Advertisement

Deepika Pilli : దీపికా పిల్లి ప్రస్తుతం బుల్లితెరపై హాటు, నాటు యాంకర్‌గా దూసుకుపోతోంది. అయితే ఆమెకు ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు. కేవలం స్టార్ మాలోని కామెడీ స్టార్స్ షోలోనే చేస్తోంది. అది కూడా ఆమెకు ఢీ వల్లే వచ్చింది. అప్పుడు ఢీ షోలో ఆది, రష్మీ, సుధీర్‌లతో కలిసి చేసింది. అంతకు ముందు టిక్ టాక్ వల్ల ఫేమస్ అయింది. టిక్ టాక్ యాప్‌లో స్టెప్పులు వేస్తూ అక్కడ ఫేమస్ అయింది. అలా అలా చివరకు ఆమెకు బుల్లితెరపై చాన్స్ దొరికింది. ఢీ షోలో దీపిక పిల్లి ఎంట్రీ ఇచ్చాకే అందరికీ ఆమె గురించి తెలిసి వచ్చింది. ఢీ షోలో ఓ సీజన్ మొత్తం చేసినా కూడా ఆమెకు అంతగా పాపులారిటీ రాలేదు.ఉందా?అంటే ఉంది అనే టైపులో కొనసాగింది.

Advertisement

ఢీ షో వల్ల ఆమెకు రష్మీతో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహాన్ని ఇప్పటికీ కొనసాగిస్తోంది దీపిక పిల్లి. రష్ అక్కా అంటూ దీపిక ప్రేమగా పిలుస్తుంటుంది. ఇక రష్మి అడుగుజాడల్లోనే దీపిక నడుస్తుంటుంది. రష్మీని చూసి ఆమె చేసే మంచి పనులు మూగ జీవాల కోసం కష్టపడే తీరు చూసి దీపిక పిల్లి ఫిదా అయింది. అలా ఆమె కూడా పెట్ లవర్‌గా మారింది. కుక్కలను పెంచుకోవడం ప్రారంభించింది. బుల్లితెరపైనే కాకుండా దీపిక పిల్లి నెట్టింట్లోనూ అందాల ప్రదర్శన చేస్తుంటుంది.

Deepika Pilli Shares Funny Incident With Fans

Advertisement

ఆమె షేర్ చేసే ఫోటోలు, నేచర్‌తో ఆమె గడిపే తీరు అందరినీ కట్టిపడేస్తుంటుంది. ఎప్పుడూ వెకేషన్‌లు వేస్తుంటుంది దీపిక పిల్లి. ఇక తాజాగా ఆమె ఓ ఫన్నీ పోస్ట్ వేసింది. ఏదైనా నములుతున్నప్పుడు, చీవింగమ్ తింటున్నప్పుడు అనుకోకుండా నాలికను కొరికితే ఎంత నొప్పిగా ఉంటుందో కదా?అని ఓ పోస్ట్ ఉంది. దాన్ని దీపిక షేర్ చేస్తూ.. అవును నాకు ఎప్పుడూ అలానే జరుగుతుంటుంది.. ఆ నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి