Deepthi Sunaina Shanmukh : షణ్ముఖ్, దీప్తి సునయన మళ్లీ ఒక్కటి కాబోతున్నారా.. ఏం జరుగుతుంది..!
Deepthi Sunaina Shanmukh : గత కొద్ది రోజులుగా తెగ వార్తలలో నిలుస్తూవస్తున్న క్రేజీ జంట షణ్ముఖ్- దీప్తి సునయన. మోస్ట్ లవబుల్ కపుల్‌గా ఉండే ఈ జంట ఏడాది మొదట్లో విడిపోయారు. బిగ్ బాస్‌లో షణ్ముఖ్ ప్రవర్తన వలననే దీప్తి అతనికి బ్రేకప్ చెప్పిందనే ప్రచారం నడుస్తుంది.షణ్ముఖ్ బిగ్ బాస్ వెళ్లక ముందు వెళ్లిన కొన్నాళ్ల వరకూ దీప్తి సునయనను తెగ ప్రేమించేశాడు.. దీప్తి కూడా అతనికంటే ఎక్కువ ప్రేమించింది. ఎప్పుడైతే షణ్ముఖ్-సిరిలు కొత్త ట్రాక్ మొదలుపెట్టారో మెయిన్ ట్రాక్ పట్టాలు తప్పి బ్రేకప్ అనేసింది. దీప్తి సునయన బిగ్ బాస్ తరువాత షణ్ముఖ్‌కి బ్రేకప్ చెప్పేసింది. మొత్తానికి షణ్ముఖ్ దీప్తికి దూరమైన తరువాత.. తన లైఫ్ తనదే అన్నట్టుగా ఉంటున్నారు.
దీప్తి పాత జ్ఞాపకాలు అన్నీ మరచిపోయి ఫుల్ జోష్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్‌లలో స్పీడు పెంచి.. ఫుల్ చిల్ అవుతుంది. అయితే ఈ ఇద్దరూ డైరెక్ట్‌గా కాకపోయినా ఇన్ డైరెక్ట్‌గా ఒకరికొకరి తగిలేలా కోల్డ్ వార్ నడిపిస్తున్నారు. అయితే ఫిబ్రవరి 14న ఈ జంట తిరిగి ఒక్కటి కానున్నారనే టాక్ ఒకటి నడుస్తుంది. బిగ్‌బాస్ నిర్వాహకులు ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా గ్రాండ్ సెలబ్రెషన్స్‌కు ప్లాన్ చేశారట. ఆ రోజు ఐదు సీజన్స్ కంటెస్టెంట్స్ హాజరు కానున్నారని సమాచారం.ఇక బిగ్ బాస్ ఓటీటీ కూడా అదే రోజు ప్రారంభం కానుందని, ఆ రోజు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ సందడి చేయబోతున్నారంటూ ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

deepthi sunaina join hands with shanmukh
Deepthi Sunaina Shanmukh : గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా..!
ఈ వేడుకకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయినట్లు తెలుస్తోంది.ఆ వేదికపై షణ్ముఖ్- దీప్తి సునయన జంటగా కనిపించబోతున్నట్టు ప్రచారం నడుస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా, షణ్ముఖ్ రీసెంట్‌గా ‘మై లవ్ ఈజ్ గాన్’ అనే లవ్ ఫెయిల్యూర్ సాంగ్‌కి తెగ పెర్ఫామెన్స్ చేస్తూ వీడియోలు వదులుతున్నాడు. ఆ ప్రిపరేషన్ అంతా.. ‘బిగ్ బాస్ ఉత్సవం’ ఈవెంట్‌కి సంబంధించేనా అనే డౌటానుమానాలు ఆడియన్స్‌లో మొదలయ్యాయి. అయితే బిగ్ బాస్ ఉత్సవం పార్ట్ 1కి సంబంధించి షూటింగ్ కంప్లీట్ అయ్యింది.. ఆ ఈవెంట్‌కి హాజరైన కంటెస్టెంట్స్ ఫొటోలు చాలా బయటకు వచ్చాయి.