Home » Entertainment » Deepthi Sunaina Looks In Viral
Entertainment

Deepthi Sunaina : రోజా పువ్వు ప‌ట్టుకొని త‌న్మ‌య‌త్వం చెందుతున్న దీప్తి సున‌య‌న‌.. ఎవ‌రికి ప్రపోజ్ చేయబోతున్నావ్ అంటూ కామెంట్స్

Authored By
Sam C
The Telugu News | Published on: February 23, 2022, 10:00 pm
Advertisement

Deepthi Sunaina: దీప్తి సున‌య‌న‌.. ఈ ముద్దుగుమ్మ యూట్యూబ‌ర్‌గా చాలా సుప‌రిచితం. ష‌ణ్ముఖ్‌తో క‌లిసి తెగ సంద‌డి చేసే ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది మొద‌ట్లో అత‌నికి బ్రేక‌ప్ చెప్పింది. షణ్ముఖ్ నుండి విడిపోయిన త‌ర్వాత దీప్తి సున‌య‌న ఎలా ఉంటుందో, ఏం చేస్తుందోఅని అభిమానులు తెగ ఆందోళ‌న చెందారు. కాని ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తెగ సంద‌డి చేస్తుంది. హిట్ సాంగ్స్‌కి డ్యాన్స్ లు చేస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఇక తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో పువ్వు ప‌ట్టుకొని ఫొటోల‌కు ఫోజులిచ్చింది. ఇందులో చాలా త‌న్మ‌య‌త్వంతో ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. దీప్తి క్యూట్ లుక్స్ చూసి మైర‌చిపోతున్నారు.

Advertisement

దీప్తి సునైనా ఒక యూట్యూబ్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.సునైనా బిగ్ బాస్ సీజ‌న్ 2లో పాల్గొన‌డం వల్ల మరింత గుర్తింపు సంపాదించుకుంది. షణ్ముఖ్ తో విడిపోయిన తర్వాత దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఇంకా యాక్టివ్ గా ఉంటూ చాలా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు షేర్ చేస్తుంది.ఇటీవల దీప్తిసునైనా డీజే టిల్లు సినిమాలోని సూపర్ హిట్ టైటిల్ సాంగ్‌కి స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో దీప్తి వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అయిపోయారు.కాగా ష‌ణ్ముఖ్ నుండి విడిపోయే స‌మ‌యంలో దీప్తి చాలా భావోద్వేగంతో పోస్ట్ పెట్టిన విష‌యం తెలిసిందే. “నా శ్రేయోభిలాషులు మరియు స్నేహితులందరికీ ఎంతో ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం.

deepthi sunaina looks in viral

Advertisement

Deepthi Sunaina : దీప్తి త‌గ్గ‌ట్లేదుగా..

నేను, షణ్ముఖ్ పరస్పరం మా వ్యక్తిగత జీవితాలలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఈ ఐదు సంవత్సరాలు మేము సంతోషంగా ఉన్నాం. ప్రేమ, ఎదుగుల సమయంలో మాలోని రాక్షాసులతో పోరాటం చాలా కష్టం. మీరందరు కోరుకున్నట్టే మేమిద్దరం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది చాలా కాలంగా జరుగుతుంది. మేమిద్దరం కలిసి ఉండేందుకు ప్రయత్నించాము. కానీ జీవితానికి అవసరమైన వాటిని విస్మరించాం. మా మార్గాలు వేరని తెలుసుకున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీరు మాకు అండగా ఉండండి. అలాగే మా ప్రైవసీకి భంగం కలిగించరని కోరుకుంటున్నాం.” అంటూ సుదీర్ఘ పోస్ట్ చేసింది దీప్తి సునయన.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి