Harika : అలాంటి ఫోటోలు షేర్ చేయకు.. బిగ్ బాస్ హారిక పోస్ట్‌పై కామెంట్స్

Authored By Cinema Desk | The Telugu News | Published on: March 21, 2021, 11:22 am
Dethadi Harika : బిగ్ బాస్ ఫేమ్ హారిక గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఇమేజ్‌ను హారిక బాగానే వాడుకుంటోంది. బిగ్ బాస్ షో కంటే ముందుగా దేత్తడి హారికగా తెలంగాణ యాసలో దుమ్ములేపింది. తెలంగాణ పిల్ల అంటూ అందరూ తమ మనిషిగా చూసుకున్నారు. కానీ బిగ్ బాస్ ఇంట్లో మాత్రం తెలుగు తప్పా అన్ని భాషల్లో మాట్లాడింది. నోరు తెరిస్తే ఇంగ్లీష్ భాషలోనే దంచి కొట్టింది. ఇక దేత్తడి ప్రోగ్రాంలో హారిక మంచి వస్త్రాధారణతో అందరినీ మెప్పించింది.
కానీ బిగ్ బాస్ ఇంట్లో అయితే ఆమె తన అందాలను ప్రదర్శించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించినట్టుంది. పొట్టి బట్టలు వేసుకుని ఎక్స్‌పోజింగ్ చేస్తూ కాలం వెళ్లదీసింది. ఎప్పుడూ కూడా నిక్కర్లు, పొట్టి పొట్టి బట్టలు వేసుకుని కనిపించేది. ఇక నడుము, నాభి అందాలను ఓ రేంజ్‌లో ప్రదర్శించేది. అయితే హారిక తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో ఆమె తొడ అందాలు బాగా హైలెట్ అవుతున్నాయి. దీంతో ఆమె అభిమానులు కాస్త హర్ట్ అయినట్టు కనిపిస్తున్నారు.
Dethadi Harika pic goes viral

Dethadi Harika pic goes viral

Dethadi Harika : బిగ్ బాస్ హారిక పోస్ట్‌పై కామెంట్స్

ఆమె షేర్ చేసిన ఫోటోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. హాట్‌గా ఉన్నావని కొందరు అంటుంటే.. ఇలాంటి ఫోటోలు షేర్ చేయకు అంటూ సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి హారిక మాత్రం తన హాట్ ఫోటోతో హాట్ టాపిక్ అయింది. మొన్నీ మధ్యే తెలంగాణ టూరిజం అంబాసిడర్ అంటూ నానా హంగామా చేసింది. కానీ అది మూన్నాళ్ల ముచ్చటే అయింది. అది చిలికి చిలికి గాలివానలా మారింది. చివరకు హారిక తన స్థానం నుంచి తప్పుకుంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp