NTR Devara : యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా దేవర. ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తారక్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమా నుంచి ఇప్పటికే ఒక సాంగ్ రిలీజ్ కాగా అది సూపర్ హిట్ అయ్యింది.సినిమా నుంచి త్వరలోనే సెకండ్ సాంగ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలాఉంటే కల్కి సినిమా తరహాలోనే దేవరని కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కి సినిమా రిలీజ్ ముందు పెద్దగా ప్రమోషన్స్ చేసింది లేదు.
కల్కికి ప్రమోషన్స్ చేయకపోయినా సరే అందులో స్టార్ కాస్ట్.. ఆ సెటప్ అంతా కూడా రిలీజ్ తర్వాత సినిమాను పైకి లేపాయి. కానీ దేవర లో అలా కాదు. అందులో ఎన్.టి.ఆర్ మాత్రమే ఉన్నాడు. విలన్ గా సైఫ్ అలి ఖాన్ చేస్తున్నా అతని గురించి మన ఆడియన్స్ కు అంతగా పరిచయం లేదు. కల్కి లానే దేవర కూడా పెద్దగా ప్రమోషన్స్ చేయకుండా రిలీజ్ చేస్తానంటే మాత్రం కుదరదు. దేవర సినిమాను కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని అనుకున్నారు. తర్వాత అక్టోబర్ 11న రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పుడు సెప్టెంబర్ 27న రిలీజ్ ఫిక్స్ చేశారు.
కల్కి లా కాదు ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తేనే దేవరకు పాన్ ఇండియాలో బజ్ ఏర్పడుతుంది.అంతేకాదు రాజమౌళి తో హిట్ కొట్టి నెక్స్ట్ సినిమా అందరు ఫ్లాప్ తీస్తారు. మరి ఆ బ్యాడ్ సెంటిమెంట్ ని ఎన్.టి.ఆర్ దేవర తో అధిగమిస్తాడా లేదా అన్నది చూడాలి. అసలే ఎన్.టి.ఆర్ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియా మొత్తం హంగామా చేస్తారు. అలాంటిది దేవర సరైన ప్రమోషనల్ కంటెంట్ తో రాబోతే మాత్రం సినిమా మీద భారీ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.