Home » Entertainment » Devara Pre Release Event Cancelled Due To Security Reasons
Entertainment

Devara Pre Release : దేవ‌ర ప్రీ రిలీజ్‌కి బాధ్యులెవ‌రు… ఈవెంట్ ఎందువ‌ల‌న ఆగింది ?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: September 23, 2024, 1:00 pm
Advertisement

Devara Pre Release : యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 27న విడుద‌లైంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈమూవీ ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే ప్రమోషన్స్ లో భాగంగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని నెవాటాల్ లో ఏర్పాటు చేశారు. కాని ఈ ఈవెంట్ ను అన్యూహ్యంగా రద్దు చేసినట్టు టీమ్ ప్రకటించింది. ఎన్టీఆర్ దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ ను భద్రతా పరమైన కారణాలతో రద్దు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. నోవాటాల్ లో భారీ ఎత్తును ఈవెంట్ కోసం ఏర్పాట్లు చేశారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తారక్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే నోవాటాల్ లో 2‌000 మందికి మాత్రమే సరిపోయే స్పేస్ ఉండటంతో.. గందరగోళం ఏర్పడింది.

Advertisement

Devara Pre Release ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్..

పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలి రావడం.. హాల్ కెపాసిటీని మించి నిర్మాతలు పాస్ లు జారీ చేయడం.. అంతకు మించి జనాలు రావడం.. లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో.. అభిమానులు హడావిడితో గందరగోళం ఏర్పడింది. అంతే కాదు అభిమానులు అత్యుత్సాహంతో నోవాటాల్ పాక్షికంగా ధ్వసం అయ్యింది. ఈవెంట్ కోసం అభిమానులు పెద్ద ఎత్తున గొడవ చేయడంతో.. సెక్యూరిటీ ప్రాబ్లమ్ వస్తుందని నిర్వాహకులు భావించారు. దాంతో ఈ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ ప్రకటనతో అభిమానులు నిరాశ చెందారు. అయితే ఈ విషయంలో నిర్మాతలు,నిర్వాహకులు తప్పు కూడా కనిపిస్తోంది.

Devara Pre Release : దేవ‌ర ప్రీ రిలీజ్‌కి బాధ్యులెవ‌రు… ఈవెంట్ ఎందువ‌ల‌న ఆగింది ?

Advertisement

ఎన్టీఆర్ సినిమా రాక దాదాపు మూడేళ్లకు పైనే అయ్యింది. తారక్ సినిమా కోసం తహతహలాడుతున్నారు అభిమానులు.అటువంటిది దేవర లాంటి ప్యాన్ ఇండయా సినిమాకు.. ప్రీరిలీజ్ ఈవెంట్ అంటే పెద్ద ఎత్తున నిర్వహించాలి. కేవలం రెండు వేల మంది మాత్రమే పట్టే కెపాసిటీ ఉన్న హాల్ లో..ఎన్టీఆర్ సినిమా ప్రిరిలీజ్ అనేది ఎలా సాధ్యం అవుతుంది.కెపాసిటీకి మించి పాస్ లు ఇచ్చిన శ్రేయాస్ మీడియా పై కేసు నమోదు చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మీ కంటే నా బాధ ఎక్కువ కూడా. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం వెనుక నిర్మాతలు, ఈవెంట్ ఆర్గనైజర్లను తప్పు పట్టడం సరికాదు. ముందుగా ఈ కురిపించే ప్రేమకు ఆజాన్మంతం రుణపడి ఉంటాను. ఈ రోజు కలువకపోయినా.. సెప్టెంబర్ 27వ తేదీన మళ్లీ కలువబోతున్నాం. దేవర సినిమాను మీరందరూ చూడబోతున్నారు అని ఎన్టీఆర్ ఉద్వేగంతో అంటూ కనిపించారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి