Did Prem know that Tulasi leaves the house in intinti gruhalakshmi
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 9 ఏప్రిల్ 2022, ఎపిసోడ్ 603 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి నా సహనాన్ని పరీక్షించకు ఏం నిర్ణయం తీసుకున్నావో చెప్పు అని తులసిని శశికళ అడుగుతుంది. దీంతో సమాధానం చెప్పు భాగ్య అంటుంది తులసి. దీంతో నాకు కావాల్సింది నీ నిర్ణయం అంటుంది శశికళ. నేను అప్పు ఇచ్చింది నీకు.. తీర్చాల్సింది నువ్వు అంటుంది శశికళ. దీంతో విన్నావు కదా భాగ్య.. నేను నష్టపోతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బాగుపడవు.. నేను లాభపడితే నువ్వు ఎట్టిపరిస్థితుల్లో నష్టపోవు.. అది గుర్తుపెట్టుకొని నీ నిర్ణయం చెప్పు అంటుంది తులసి.
Did Prem know that Tulasi leaves the house in intinti gruhalakshmi
దీంతో ఆలోచనలో పడిపోతుంది భాగ్య. ముసుగులో గుద్దులాటలు వద్దు నీ నిర్ణయం ఏంటో చెప్పు అంటుంది శశికళ. భాగ్య టైమ్ లేదు నీ నిర్ణయం ఏంటో చెప్పు అంటుంది తులసి. ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. కోర్టుకు వెళ్లాలనుకున్నా వెళ్లు కానీ.. ఏ నిర్ణయమో పైకి చెప్పు. ఎందుకంటే నా నిర్ణయం నేను తీసుకోవాల్సి ఉంటుంది అంటుంది తులసి. మరోవైపు శశికళకు కోపం వస్తుంటుంది. నువ్వు కోర్టుకు వెళ్తావా లేక మమ్మల్ని ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్లమంటావా అంటుంది తులసి. ఇంతలో లాస్య.. భాగ్యకు ఫోన్ చేస్తుంది. తన ఫోన్ ఎత్తకుండా కట్ చేసి.. నీ ఆఫర్ నాకు ఓకే అని చెబుతుంది భాగ్య.
దీంతో ఈ పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నందుకు నన్ను క్షమించండి అని పరందామయ్య, అనసూయకు చెప్పి.. ఇక నుంచి ఈ ఇల్లు నీదే అని శశికళకు చెబుతుంది తులసి. వెంటనే తను ముందే చెప్పినట్టుగా 20 లక్షలను తెచ్చి తులసి చేతుల్లో పెడుతుంది శశికళ.
ఆ డబ్బును తులసి వెంటనే భాగ్యకు ఇచ్చేస్తుంది. దీంతో సంతోషం వ్యక్తం చేసిన భాగ్య వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మీరు ఇల్లు ఇప్పుడే ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొన్ని రోజులు ఇండి ఖాళీ చేయొచ్చు అని చెబుతుంది శశికళ. కానీ.. ఈ ఇల్లు ఇప్పటి నుంచి మాకు పరాయిది. రేపే ఖాళీ చేస్తాం అని చెబుతుంది తులసి.
ఆటోలో సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉంటుంది భాగ్య. ఇంతలో లాస్య ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి అని అడుగుతుంది. దీంతో ఫోన్ లిఫ్ట్ చేసే అవసరం లేదు. అక్కడ పని అయిపోయింది. తులసి అక్క ఆఫర్ కు ఓకే చెప్పేశా అని అంటుంది. దీంతో లాస్య షాక్ అవుతుంది.
ఈ విషయం నందుకు చెప్పడంతో నందు షాక్ అవుతాడడు. లోన్ తీసుకుంటా అని తులసి చెప్పింది కదా. కానీ.. ఇలా ఇంటికి అమ్మేయడం ఏంటి అని షాక్ అవుతాడు నందు. అవన్నీ నాటకాలు అంటుంది లాస్య. మీ తులసిది మామూలు తెలివి కాదు అంటుంది లాస్య. మరి ఇల్లు అమ్మేసి ఎక్కడికి వెళ్తారు అని అడుగుతాడు నందు.
మరోవైపు దీపక్ తన ఇంటికి వచ్చి తులసిని తనతో తీసుకెళ్తా అంటాడు. కానీ.. తులసి మాత్రం రాను అంటుంది. నేను ఎక్కడికీ రాను. వాళ్లు కన్నకొడుకును కాదనుకొని నాతో ఉంటున్నారు. వాళ్లతో పాటే నేను ఉంటాను అంటుంది తులసి. నేను ఎవ్వరితో రాను అంటంది తులసి.
మరోవైపు తులసి, అభి, అంకిత, దివ్య, పరందామయ్య, అనసూయ ఇల్లు ఖాళీ చేస్తారు. బ్యాగులు పట్టుకొని బయలుదేరుతారు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
This website uses cookies.