Intinti Gruhalakshmi : ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తులసికి భారీ షాక్.. పరందామయ్య, అనసూయ తనతో వస్తారా? అభి, అంకిత పరిస్థితి ఏంటి? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Intinti Gruhalakshmi : ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తులసికి భారీ షాక్.. పరందామయ్య, అనసూయ తనతో వస్తారా? అభి, అంకిత పరిస్థితి ఏంటి?

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 9 ఏప్రిల్ 2022, ఎపిసోడ్ 603 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి నా సహనాన్ని పరీక్షించకు ఏం నిర్ణయం తీసుకున్నావో చెప్పు అని తులసిని శశికళ అడుగుతుంది. దీంతో సమాధానం చెప్పు భాగ్య అంటుంది తులసి. దీంతో నాకు కావాల్సింది నీ నిర్ణయం అంటుంది శశికళ. నేను అప్పు ఇచ్చింది నీకు.. తీర్చాల్సింది […]

 Authored By gatla | The Telugu News | Updated on :10 April 2022,9:30 am

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 9 ఏప్రిల్ 2022, ఎపిసోడ్ 603 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి నా సహనాన్ని పరీక్షించకు ఏం నిర్ణయం తీసుకున్నావో చెప్పు అని తులసిని శశికళ అడుగుతుంది. దీంతో సమాధానం చెప్పు భాగ్య అంటుంది తులసి. దీంతో నాకు కావాల్సింది నీ నిర్ణయం అంటుంది శశికళ. నేను అప్పు ఇచ్చింది నీకు.. తీర్చాల్సింది నువ్వు అంటుంది శశికళ. దీంతో విన్నావు కదా భాగ్య.. నేను నష్టపోతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బాగుపడవు.. నేను లాభపడితే నువ్వు ఎట్టిపరిస్థితుల్లో నష్టపోవు.. అది గుర్తుపెట్టుకొని నీ నిర్ణయం చెప్పు అంటుంది తులసి.

Did Prem know that Tulasi leaves the house in intinti gruhalakshmi

Did Prem know that Tulasi leaves the house in intinti gruhalakshmi

దీంతో ఆలోచనలో పడిపోతుంది భాగ్య. ముసుగులో గుద్దులాటలు వద్దు నీ నిర్ణయం ఏంటో చెప్పు అంటుంది శశికళ. భాగ్య టైమ్ లేదు నీ నిర్ణయం ఏంటో చెప్పు అంటుంది తులసి. ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. కోర్టుకు వెళ్లాలనుకున్నా వెళ్లు కానీ.. ఏ నిర్ణయమో పైకి చెప్పు. ఎందుకంటే నా నిర్ణయం నేను తీసుకోవాల్సి ఉంటుంది అంటుంది తులసి. మరోవైపు శశికళకు కోపం వస్తుంటుంది. నువ్వు కోర్టుకు వెళ్తావా లేక మమ్మల్ని ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్లమంటావా అంటుంది తులసి. ఇంతలో లాస్య.. భాగ్యకు ఫోన్ చేస్తుంది. తన ఫోన్ ఎత్తకుండా కట్ చేసి.. నీ ఆఫర్ నాకు ఓకే అని చెబుతుంది భాగ్య.

దీంతో ఈ పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నందుకు నన్ను క్షమించండి అని పరందామయ్య, అనసూయకు చెప్పి.. ఇక నుంచి ఈ ఇల్లు నీదే అని శశికళకు చెబుతుంది తులసి. వెంటనే తను ముందే చెప్పినట్టుగా 20 లక్షలను తెచ్చి తులసి చేతుల్లో పెడుతుంది శశికళ.

ఆ డబ్బును తులసి వెంటనే భాగ్యకు ఇచ్చేస్తుంది. దీంతో సంతోషం వ్యక్తం చేసిన భాగ్య వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మీరు ఇల్లు ఇప్పుడే ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొన్ని రోజులు ఇండి ఖాళీ చేయొచ్చు అని చెబుతుంది శశికళ. కానీ.. ఈ ఇల్లు ఇప్పటి నుంచి మాకు పరాయిది. రేపే ఖాళీ చేస్తాం అని చెబుతుంది తులసి.

Intinti Gruhalakshmi : భాగ్యపై లాస్య సీరియస్

ఆటోలో సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉంటుంది భాగ్య. ఇంతలో లాస్య ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి అని అడుగుతుంది. దీంతో ఫోన్ లిఫ్ట్ చేసే అవసరం లేదు. అక్కడ పని అయిపోయింది. తులసి అక్క ఆఫర్ కు ఓకే చెప్పేశా అని అంటుంది. దీంతో లాస్య షాక్ అవుతుంది.

ఈ విషయం నందుకు చెప్పడంతో నందు షాక్ అవుతాడడు. లోన్ తీసుకుంటా అని తులసి చెప్పింది కదా. కానీ.. ఇలా ఇంటికి అమ్మేయడం ఏంటి అని షాక్ అవుతాడు నందు. అవన్నీ నాటకాలు అంటుంది లాస్య. మీ తులసిది మామూలు తెలివి కాదు అంటుంది లాస్య. మరి ఇల్లు అమ్మేసి ఎక్కడికి వెళ్తారు అని అడుగుతాడు నందు.

మరోవైపు దీపక్ తన ఇంటికి వచ్చి తులసిని తనతో తీసుకెళ్తా అంటాడు. కానీ.. తులసి మాత్రం రాను అంటుంది. నేను ఎక్కడికీ రాను. వాళ్లు కన్నకొడుకును కాదనుకొని నాతో ఉంటున్నారు. వాళ్లతో పాటే నేను ఉంటాను అంటుంది తులసి. నేను ఎవ్వరితో రాను అంటంది తులసి.

మరోవైపు తులసి, అభి, అంకిత, దివ్య, పరందామయ్య, అనసూయ ఇల్లు ఖాళీ చేస్తారు. బ్యాగులు పట్టుకొని బయలుదేరుతారు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది