Home » Entertainment » Did Samantha Insult Nagarjuna So Much Akkineni Fans On Fire
Entertainment

Samantha – Nagarjuna : నాగార్జున‌ను సమంత అంత‌లా అవ‌మానించిందా..? ఫైర్ అవుతున్న అక్కినేని ఫ్యాన్స్

Authored By
aruna
The Telugu News | Published on: August 16, 2022, 1:00 pm
Advertisement

Samantha – Nagarjuna : టాలీవుడ్ రొమాంటిక్ క‌పుల్స్ స‌మంత నాగ‌చైత‌న్య విడిపోయి దాదాపు నెలలు గ‌డుస్తున్నా ఇంకా ఏదో ఒక విష‌యంలో వైర‌ల్ అవుతూనే ఉన్నారు. ఇక స‌మంత చాన్స్ దొరికితే ఘాటుగా స్పందిస్తోంది. ఇటీవ‌ల కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో ఎక్స్ హ‌స్బెండ్ అంటూ… ఒకే రూమ్ లో ఉంటే ఆయుధాలు ఉండాలి అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అక్కినేని వంటి ఫ్యామిలీ ఇంటి కోడ‌లుగా అడుగు పెట్టి చివ‌ర‌కు విడిపోయి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తోంది. తాజాగా నాగార్జునను అన్న మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. నిజానికి టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి ఓ గౌర‌వం ఉంది. అక్కినేని నాగేశ్వ‌ర్ రావు త‌ర్వాత ఆయ‌న కొడుకు నాగార్జున తండ్రికి త‌గ్గ వార‌సుడిగా రాణించారు. పైగా ఇండస్ట్రీలో గౌర‌వ మ‌ర్యాదలు ఉన్న హీరోగా ఆయ‌న‌కు మంచి గుర్తింపు ఉంది.

Advertisement

ఇక నాగ‌చైత‌న్య కూడా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంటున్నాడు. ఎందుకో నాగార్జున త‌ర్వాత ఆ స్థాయి హీరో అనిపించుకోలేక‌పోయాడు చైత‌న్య‌. అలాగ‌వే వ్య‌క్తిగ‌తంగా కూడా నాగ‌చైత‌న్య జీవితం ఏమంత బాగోలేదు. ఇక స‌మంతతో విడిపోయి ప్ర‌స్తుతం ఒంట‌రిగానే ఉంటున్నాడు. ఇక ఇటీవ‌ల ఓ తెలుగు హీరోయిన్ తో ప్రేమ‌లో ఉన్నాడ‌నే పుకార్లు వినిపించాయి. అయితే చిన్న‌ప్పుడే త‌ల్లి దూరం కావ‌డం, ఇప్పుడు భార్య కూడా దూరం కావ‌డం ఆయ‌న‌కు లోట‌నే చెప్పాలి. అయితే స‌మంత‌, చైతూ డైవ‌ర్స్ పై ఎన్నో పుకార్లు వినిపించాయి. స‌మంత‌కు పిల్ల‌ల్ని క‌న‌డం ఇష్టం లేద‌ని కొంద‌రంటే.. ఇంకొంద‌రేమో చైతూకు వేరే అమ్మాయిల‌తో ఎఫైర్లు ఉన్నాయ‌ని ఇలా చాలానే వినిపించాయి.

Did Samantha insult Nagarjuna so much? Akkineni fans on fire

Advertisement

Samantha – Nagarjuna : ఆయ‌నకు అంత సీన్ లేద‌ట‌..!

అయితే మొద‌ట్లో స‌మంత చైతు విడిపోవాల‌నుకున్న‌ప్పుడు నాగార్జున వారి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌డానికి ఎంత‌గానో ప్ర‌య‌త్నించాడ‌ట‌. అయితే తాజాగా ఓ విష‌యం వైర‌ల్ అవుతోంది. వీరిద్ద‌రూ విడాకులు తీసుకోక ముందు వేర్వేరుగా కొద్దిరోజులు ఉన్నారు. ఆ స‌మయంలో నాగార్జున‌కు విష‌యం తెలిసి వారిని క‌లిపేందుకు ప్ర‌య‌త్నించాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే స‌మంత‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయ‌లేద‌ట‌. మ‌రోసారి కాల్ చేసినా స‌మంత మాత్రం ప‌ట్టించుకోలేద‌ట‌. ఇక అప్పుడు ప‌క్క‌నే ఉన్న ఓ టాలీవుడ్ హీరో లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు క‌దా.. అని చెప్ప‌గా..ఆయ‌న‌కు ఇంట్లో అంత సీన్ లేదు. ఆయ‌న (నాగార్జున‌) భార్య చెప్పిన‌ట్టే వింటాడు.. ఆయ‌న‌తో మాట్లాడి వేస్ట్‌.. అని అంద‌రి ముందే అనేసిందంట‌. ఈ విష‌యంలో నిజం ఎంతుందో తెలియ‌న‌ప్ప‌టికీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం స‌మంత‌పై ఫైర్ అవుతున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి