Tollywood : టాలీవుడ్ లో భక్తి ప్రధాన చిత్రాలకి పెరుగుతున్న క్రేజ్.. అమ్మోరు తరహాలో చిత్రాలు
ప్రధానాంశాలు:
Tollywood : టాలీవుడ్ లో భక్తి ప్రధాన చిత్రాలకి పెరుగుతున్న క్రేజ్.. అమ్మోరు తరహాలో చిత్రాలు
Tollywood : టాలీవుడ్ లో భక్తి కథలకు పునరుజ్జీవం లభిస్తోంది. ఒకప్పుడు అఖండ విజయాలు అందించిన ‘అమ్మోరు’, ‘దేవిపుత్రుడు’ వంటి సినిమాల తరహాలో ఇప్పుడు మళ్లీ అలాంటి విభిన్నమైన, పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న చిత్రాల దిశగా నిర్మాతలు అడుగులు వేస్తున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, దిల్ రాజు కాంపౌండ్‌లో రూపొందుతున్న ‘ఎల్లమ్మ’ సినిమా దానికి నిదర్శనం.

Tollywood : టాలీవుడ్ లో భక్తి ప్రధాన చిత్రాలకి పెరుగుతున్న క్రేజ్.. అమ్మోరు తరహాలో చిత్రాలు
Tollywood : ట్రెండ్ మారింది..
అదే పంథాని కొనసాగిస్తూ ఇప్పుడు ‘మారెమ్మ’ అనే టైటిల్‌ను ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయడం సినిమా వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాతో రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. భక్తి, యాక్షన్, ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం మాధవ్ కెరీర్‌కు ఓ పవర్‌ఫుల్ లాంచ్ కావచ్చని టాక్.
ఇటీవలి కాలంలో మాస్, యాక్షన్, లవ్ స్టోరీస్‌కి బాగా ఆదరణ లభించినప్పటికీ, ఇప్పుడు మళ్ళీ పౌరాణిక భక్తి కథలు తెరపైకి వస్తుండటం ఆసక్తికర పరిణామం. OTTలో కూడా భక్తి ధార్మిక కంటెంట్‌కు మంచి ఆదరణ ఉండడంతో, నిర్మాతలు ఈ తరహా ప్రయోగాలకు మొగ్గు చూపుతున్నారు.‘ఎల్లమ్మ’ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.‘మారెమ్మ’ స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయి.