Dil Raju : సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి చర్చించే అవకాశం ఉందని ప్రముఖ నిర్మాత ఎఫ్.డీ.సీ చైర్మన్ దిల్ రాజు అన్నారు. సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో జరిగిన ఘటన వల్ల సీఎం రేవంత్ రెడ్డి ఇక మీదట తెలంగాణాలో టికెట్ రేట్లు పెంచేది లేదని అసెంబ్లీలో చెప్పారు. అంతేకాదు బెనిఫిట్ షోస్ కూడా ఉండవని అన్నారు. దీనిపై తెలుగు సినీ పరిశ్రమ పెద్దలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఐతే సంక్రాంతి సినిమాలకు తెలంగాణాలో టికెట్ రేట్లు పెరగలేదు. అక్కడ ఏపీలో బెనిఫిట్ షోస్ పర్మిషన్స్ తో పాటు సినిమాల టికెట్ రేట్లు పెంచారు. కానీ తెలంగాణాలో ఇప్పటివరకు అలాంటి ఊసే లేదు.
దీనిపై దిల్ రాజు లేటెస్ట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా టికెట్ రేట్లు హైక్ ఇవ్వండని రేవంత్ రెడ్డిని అడుక్కుంటున్నా అని అన్నారు. ఐతే ఇస్తారా లేదా అన్నది సీఎం రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉందని అంతా ఆయన దయ అని అన్నారు దిల్ రాజు. సీఎం తో మీటింగ్ లో సినిమాలకు సపోర్ట్ చేస్తామన్నారు. కావాల్సినవి అన్నీ ఇస్తానని అన్నారు. ఆ ఆశతోనే ఉన్నామని అన్నారు దిల్ రాజు. ఏపీలో టికెట్ రేట్లు, బెనిఫిట్ షోస్ పర్మిషన్ ఇచ్చారు. తెలంగాణాలో కూడా ఇవ్వండని అడుగుతానని అన్నారు దిల్ రాజు. ఐతే ఈ సంక్రాంతికి రెండు భారీ సినిమాలను రిలీజ్ పెట్టుకున్నాడు దిల్ రాజు.
టికెట్ రేట్లు పెంచకపోతే ఆయనకే పెద్ద లాస్ జరిగేలా ఉంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు పెంచకపోయినా పర్వాలేదు కానీ రాం చరణ్ తో చేసిన గేం ఛేంజర్ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో తీశారు. కాబట్టి ఆ సినిమాకు టికెట్ రేట్లు పెంచకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. మరి సీఎం తో చర్చిస్తామని అంటున్న దిల్ రాజు ఆయన కోరినట్టే టికెట్ రేట్లు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా అన్నది చూడాలి.
Vishal : పేరుకు తమిళ హీరోనే అయినా.. తెలుగులోనూ మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు Vishal విశాల్. అసలు విశాల్…
AP Inter Exams 2025 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు AP Inter Exams 2025 సంచలనం నిర్ణయం ప్రకటించింది.…
Central Government : కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రోడ్డు Cashless Treatment Scheme…
Nara Lokesh : గత కొద్ది రోజులుగా ఏపీలో Nara Lokesh అనేక మార్పులు చూస్తూ వస్తున్నాం. ముఖ్యంగా విద్యార్ధులకి…
Aarogyasri : తెలంగాణలో ఈ నెల 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు Aarogyasri నిలిపివేస్తామని నెట్వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.…
Ears : మన శరీరంలో జ్ఞానేంద్రియాలు ఒకటైనవి చెవులు. ఇవి Ears మన శరీరంలో అత్యంత సున్నితమైన భాగం. మన శరీర…
Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి Lavanya Tripathi పెళ్లి తర్వాత కూడా ఫోటో షూట్స్ విషయంలో…
Akira Nandan : పవన్ కళ్యాణ్ Pawan Kalyan రేణూ దేశాయ్ల తనయుడు అకీరా నందన్ సినీ ఎంట్రీ గురించి…
This website uses cookies.