Prabhas : బ‌రువు త‌గ్గ‌లేక‌పోతున్న ప్ర‌భాస్.. ద‌ర్శ‌కుడు సీరియ‌స్ అయ్యాడా..!

Authored By Sam C | The Telugu News | Published on: September 6, 2022, 10:00 pm

Prabahs : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. త‌న క‌టౌట్‌తో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ఇక అక్క‌డి నుండి త‌గ్గేదే లే అంటూ దూసుకుపోతున్నాడు. అయితే బాహుబలి సినిమా కోసం బరువు పెరిగిన ప్రభాస్… ఆ తర్వాత దాదాపుగా అంతే బరువుతో కనిపిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన రాధేశ్యామ్ సినిమాలో కూడా ప్రభాస్ లుక్‌పై అభిమానులు సైతం నిరాశ వ్యక్తం చేశారు. అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఫిజిక్ సమస్యగా మారుతోందని సమాచారం అందుతోంది.

సాహో , రాధేశ్యామ్ సినిమాలలో ప్రభాస్ లుక్ కు సంబంధించిన సీజీ వర్క్‌కు కూడా భారీ మొత్తం ఖర్చు చేశారని వార్తలు వచ్చాయి. ప్రభాస్ షూటింగ్ చేస్తున్న సినిమాలలో సలార్ ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో శృతిహాసన్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా వరుస షూటింగ్ లతో చిత్ర బృందం బిజీగా ఉంది. అలాగే ప్రభాస్ ఈ చిత్రంతో పాటు ప్రాజెక్ట్ k అన్న పేరుతో ఇంకొక సినిమా కూడా చేస్తున్నాడు. అదేవిధంగా ఆదిపురుష్ అనే సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి.అయితే ఆ షూటింగ్స్ కోసం ప్రభాస్ అప్పుడప్పుడు ముంబై వెళ్లాల్సి వస్తుంది.

director serious on prabhas

director serious on prabhas

Prabhas : ప్ర‌భాస్ ప‌రిస్థితి దారుణం..

ఇలా బిజీగా ఉండడంతో ప్రభాస్ శరీరాకృతి ఒక్క క్రమ పద్ధతిలో ఉంచుకోవడం చాలా కష్టం అవుతుంది అని తెలిసింది. వరుస షూటింగ్ లతో ప్రభాస్ లుక్ మారిపోతుండడంతో చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ కొంచెం అసంతృప్తి చెందుతున్నాడు. అందుకే చాలా వరకు యాక్షన్ సీన్లలో ప్రభాస్ కు బదులుగా ఒక డూప్ ను పెట్టి తీసుకున్నట్టు సమాచారం తెలిసింది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కన్నా అతని డూప్ నే ఎక్కువగా నమ్ముకున్నాడని అందరూ అంటున్నారు. ప్రస్తుతం డూప్ తో అడ్జస్ట్ అవుతూ సీన్ లను చిత్రీకరిస్తున్నాడట ప్రశాంత్ నీల్. దీనిపై క్లారిటీ రావాల‌సి ఉంది.

Sam C

No bio available for this author.

  1. "Giribabu Net Worth : ఒక్క సినిమాతో 25 ఏళ్ల సంపాదన ఆవిరి.. గిరిబాబు ఆస్తుల విలువ ఎంతంటే..?"

  2. "Jr NTR Anil Ravipudi : ఇది క‌దా మ‌న‌కు కావాల్సింది… ఎన్టీఆర్ – అనిల్ రావిపూడి కాంబో పై ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..!"

  3. "IND vs PAK U19 Final : అండర్-19 ఆసియా కప్ మనదే… ఆఖరి బంతికి పాకిస్థాన్‌పై భారత్ చారిత్రాత్మక విజయం..!"

  4. "AP Government : ఏపీ ప్రభుత్వం మరో కొత్త స్కీమ్.. కుటుంబ పెద్ద మరణిస్తే నేరుగా ఖాతాలోకి రూ.20 వేలు.. అప్లై ఎలాగంటే..?"

  5. "Vemuri Radhakrishna : అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్.. సీఎంలను సైతం తన దగ్గరికి రప్పించుకునే వేమూరి రాధాకృష్ణ మంత్రదండం ఏంటి..?"

  6. "Kushaiguda : కుషాయిగూడ బస్‌స్టాప్ సమస్యకు పరిష్కారం.. పరమేశ్వర్ రెడ్డికి ప్రజల కృతజ్ఞతలు"

  7. "Actor Giribabu : బిగ్ బ్రేకింగ్ న్యూస్‌.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp