
Pushpa Movie Part 3 : పుష్ప పార్ట్ 3 ఉందా... సుకుమార్ భయ్యా అసలు ఏం ప్లాన్ చేస్తున్నవు...!
Pushpa Movie Part 3 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 1 The Rise అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భారీ కలెక్షన్స్ రాబట్టింది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు అని చెప్పాలి . ఇక పార్ట్ 1 ముగిసిన తర్వాత పుష్ప 2 the rule అనే పేరుతో పార్ట్ 2 ఉన్నట్లుగా సినీ బృందం వెల్లడించడం జరిగింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం పుష్ప 2 సినిమాను ఆగస్టు 15న విడుదల చేస్తామని అఫీషియల్ డేట్ అనుకున్నారు. ఆ డేట్ కి కచ్చితంగా రాబోతుంది అని సినీ బృందం పోస్టర్ కూడా విడుదల చేసింది. అయితే పుష్ప 2 సినిమా షూటింగ్ లేట్ అవుతుంది కాబట్టి విడుదలకు ఆలస్యం అవుతుందని పలు రకాల వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాపై మరొక న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
అదేంటంటే ఈ సినిమాను సుకుమార్ గారు 3 పార్ట్స్ గా విడుదల చేయబోతున్నారట. అయితే ఇప్పటివరకు పుష్ప 2 రెండు భాగాలుగా వస్తుంది అని మాత్రమే మనకు తెలుసు. కానీ ఇప్పుడు మూడవ భాగం కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే rise ,rule రెండు భాగాలు ఉన్నాయని మనకి తెలుసు ఇక ఇప్పుడు భాగం role పేరుతో తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.అయితే పుష్ప 2 సినిమా ఆగస్టులో విడుదల ఉంది కాబట్టి రెండు నెలలకు ముందు నుంచే సినిమా ప్రమోషన్స్ ప్రారంభిస్తారు కాబట్టి ఈ Rule అనే క్యాప్షన్ తీసేసి పుష్పా ది Role అని పెడతారా లేక Role అనేది 3వ భాగమా అనేది తెలియాల్సి ఉంది. ఇక దానికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ మూవీ టీం ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు ప్రకారం అయితే పార్ట్ 2 పై భారత దేశవ్యాప్తంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే పుష్పా ని 3 భాగలుగా సుకుమార్ గారు తీర్చిదిద్దబోతున్నారంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
ఇక ఈ మూడు భాగాలు కూడా ఇండియా పరంగా చరిత్రలో మిగిలిపోయేలాగా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. అలాగే మూవీ మేకింగ్ పరంగా బడ్జెట్ పరంగా ఎలాంటి కాంప్రమైజ్ అవ్వట్లేదు. అందుకే షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుంది. కానీ వారు విడుదలకు ఇచ్చిన డేట్ ఏదైతే ఉందో ఆ సమయానికి కచ్చితంగా విడుదల చేస్తామని చెబుతున్నారు. కాబట్టి పుష్ప పార్ట్ 2 సినిమా ఎలాంటి ఆలస్యం లేకుండా ఆగస్టు 15న మన ముందుకు రానుంది. ఇక ఈ సినిమాపై వచ్చిన వార్తలైతే చక చక వైరల్ అయిపోయాయి. ఈ క్రమంలోనే పుష్ప Rule అనేది Role గా రాబోతుందా లేక Role మూడో భాగమా అనే విషయాన్ని సుకుమార్ గారు ప్రత్యేకంగా చెప్పేంతవరకు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి అని చెప్పాలి.
Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
KCR : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…
Against Mutual Funds : నేటి డిజిటల్ యుగంలో లోన్ తీసుకోవడం చాలా సులభమైపోయింది. పర్సనల్ లోన్, హోమ్ లోన్…
BB JODI Season 2 Promo 1 : బుల్లితెర పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో 'బీబీ జోడీ సీజన్…
This website uses cookies.