Home » Entertainment » Discussion Among Fans In Tollywood About Jr Ntr Beard
Entertainment

Jr NTR : ఎన్టీఆర్ గడ్డం.. బ్రహ్మాస్త్ర కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూపులు!

Authored By
aruna
The Telugu News | Published on: September 1, 2022, 10:00 pm
Advertisement

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి అభిమానుల ముందుకు రాబోతున్నాడు, బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సినిమా బ్రహ్మాస్త్ర విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తెలుగు వెర్షన్ ప్రమోషన్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్రీ రిలీజ్ వేడుకలో పాల్గొనేందుకు ఓకే చెప్పాడు. రాజమౌళి సమర్పిస్తున్న సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ఎన్టీఆర్ హాజరు కాబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. రేపు హైదరాబాదులో భారీ ఎత్తున జరగబోతున్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని కలిసిన సందర్భంగా ఎన్టీఆర్ గడ్డం లుక్కు అందర్నీ ఆకర్షించింది. కొందరు మరీ ఇంత గడ్డం ఎందుకు పెంచాడు అంటూ చర్చించుకోగా.. మరి కొందరు మరికొన్ని రకాలుగా చర్చించుకున్నారు. మొత్తానికి ఆయన గడ్డం గురించి అయితే భారీ ఎత్తున చర్చ జరిగింది. రేపు మళ్లీ ప్రేక్షకుల ముందుకు ఎన్టీఆర్ రాబోతున్న నేపథ్యంలో ఆయన లుక్కు గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్ గడ్డం చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది.

Discussion among fans in Tollywood about Jr NTR beard

Advertisement

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా కోసం ఆయన గడ్డం పెంచుతున్నాడు అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ కొరటాల శివ సినిమా ప్రారంభం అవ్వడానికి మరో రెండు మూడు నెలల సమయం పట్టబోతుంది. ఈ నేపథ్యంలో ఆయన ఇంకా గడ్డం పెంచుకుంటూ ఉంటే యోగిలా మారుతాడు అంటూ కొందరు కామెడీ చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ గడ్డం మరియు ఆయన ఫిజిక్ విషయమై బ్రహ్మాస్త్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మరోసారి ఆసక్తికరంగా చర్చ సాగే అవకాశం ఉందని టాలీవుడ్ మీడియా వర్గాల వారు మరియు నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి