Ravi Teja : మాస్ మహారాజా రవితేజ మళ్లీ అదే పాత రొమాంటిక్ సన్నివేశాలు వెగటు పుట్టించే లవ్ సన్నివేశాలు చేస్తూ ధమాకా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు అంటూ ఆయన అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాలు పెద్దగా ఆడడం లేదు. ఒకటి రెండు సినిమా లు తప్ప వచ్చిన సినిమా లు వచ్చినట్లుగా వెనక్కు వెళ్ళి పోతున్నాయి. ఆయన సక్సెస్ రేటు ఈ మధ్య చాలా దారుణంగా పడిపోయింది. అయినా కూడా వరుసగా రెగ్యులర్ ఫార్మాట్ లోనే సినిమాలను చేయడంతో అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది.
గత కొన్ని సంవత్సరాలుగా ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో కూడా హీరోయిన్ తో వెగకు పుట్టించే రొమాన్స్ లవ్ సన్నివేశాలు ఉంటున్నాయి. ఆయన కెరియర్ ఆరంభంలో ఇలాంటి సన్నివేశాలు మరియు లవ్ సీన్స్ ని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు ఆయన వయసు 50 సంవత్సరాలు.. అయినా కూడా ఇప్పుడు లవ్ సీన్స్ చేస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి. అందుకే ఆయన లవ్ సీన్స్ మరియు రొమాంటిక్ సీన్స్ చేస్తే చూడాలనిపించడం లేదు అంటూ అభిమానులు మరియు విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో రవితేజ అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు ఒక విషయాన్ని ఆయనతో చెప్పాలనుకుంటున్నారు.
అలాంటి సన్నివేశాలు మరియు లవ్ సీన్స్ నీకు బోర్ కొట్టలేదేమో కానీ చూసి చూసి మాకు బోర్ కొట్టాయి. కనుక కొత్తగా ఏమైనా ట్రై చెయ్ భయ్యా అంటూ సోషల్ మీడియా ద్వారా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా విడుదల అయినా ధమాకా వీడియో ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. ఆ సినిమాలో లవ్ మరియు రొమాంటిక్ సన్నివేశాలు మరింత వెగటు పుట్టే విధంగా ఉంటాయేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రవితేజ ఈ సమయంలో సినిమాలు ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, ఆయన నుండి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో ఇప్పటికే ఆయన సినిమాలు ఫ్లాప్ అవడం ద్వారా తెలుసుకొని ఉండాలంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.