yper Aadi : హైపర్ ఆది…ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు చాలా కఠినమైన జీవితం అనుభవించిన హైపర్ ఆది ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ దక్కించుకున్నారు. జబర్ధస్త్‌కి రైటర్ వచ్చి ఆ తర్వాత అందులో ఒక పార్టిసిపెంట్‌గా ఉండి ఆ తర్వాత టీం లీడర్‌గా కూడా మారాడు. ఇప్పుడు హైపర్ ఆది ఏ షోలో ఉన్నా అది సూపర్ హిట్టే. ఒకవైపు టీవీ షోలు మరోవైపు సినిమాలు మధ్య మధ్యలో రాజకీయాలతోను ఫుల్ బిజీగా ఉంటున్నాడు. జనసేన తరపున ఆది పోటీ చేసే అవకాశం ఉందని కొందరు చెప్పుకొస్తున్నా ఇందులో ఎంత క్లారిటీ ఉందనేది మాత్రం తెలియదు. అయితే ఆది బాగానే చదువుకున్నాడు. హైదరాబాద్‌కి జాబ్ కోసం వచ్చాడు.
జాబ్ దక్కించుకున్న ఆది జబర్ధస్త్‌లోకి ఎలా వచ్చాడో కొద్ది మందికే తెలుసు. ముందుగా ఆయన అదిరే అభి టీం లో స్కిట్స్ చేసేవాడు. ఆ తర్వాత టీం లీడర్ గా మారాడు. రైజింగ్ రాజు, శాంతి స్వరూప్, దొరబాబు లపై ఆది వేసే పంచులు తెగ నవ్వించేవి.. ముఖ్యంగా రైజింగ్ రాజు, ఆది కాంబినేషన్ చాలా సూపర్ హిట్ అయింది. పంచ్‌లతోనే తెగ నవ్వించే ఆది ఒకదాని తర్వాత ఒకటిగా సక్సెస్ కొట్టేవాడు. ఆదికి మెల్లమెల్లగా క్రేజ్ వచ్చింది. అన్ని టీవీ షోలలో ఆయనని తప్పక తీసుకుంటున్నారు. స్టార్ రేంజ్‌కి చేరుకున్న ఆదికి రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఇస్తున్నారు. అయితే ఆది ఓ సందర్భంలో తాను జబర్ధస్త్‌లోకి ఎలా వచ్చాడో చెప్పుకొచ్చాడు.
నాకు పక్క వాళ్ళని నవ్వించడం ఇష్టం. కూర్చుని చేసే జాబ్ బోర్ కొట్టడం వలన జబర్ధస్త్‌కి రావాలని అనుకున్నాను. అత్తారింటికి దారేది మూవీ స్పూఫ్ చేసి యూట్యూబ్ లో పెడితే వేలలో వ్యూస్ వచ్చాయి. దానిని ఫేస్ బుక్‌లో పోస్ట్ చేయగా, అది అదిరే అభి దృష్టికి వచ్చింది. ఒకసారి తనని కలవమని అన్నాడట. అప్పుడు అభిని కలవగా ఆ సమయంలో జబర్దస్త్ కమెడియన్స్ తో ఫోటోలు దిగి పోస్ట్ చేస్తే .. వందల లైక్స్ వచ్చాయి . కేవలం ఫోటోలు పోస్ట్ చేస్తేనే ఇంత మంది లైక్ చేశారు. వాళ్ళతో కలిసి కామెడీ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన తనకి రాగా వెంటనే జబర్ధస్త్‌కి వెళ్లాడట. అలా అతని ప్రయాణం సాగింది. ఇక ఆ తర్వాత ఆది ఢీ, శ్రీ దేవి డ్రామా కంపెనీ షోలు చేసాడు. జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన వీలున్నప్పుడు సినిమాలు చేస్తున్నాడు. మల్లెమాల టీం హైపర్ ఆది పెళ్లి అంటూ పలు ఈవెంట్లు కూడా చేస్తూ మంచి టీఆర్పీ సాధిస్తుంది. అయితే ఆయన రియల్ లైఫ్‌లో పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.