
Do you know how many crores they have lost due to Samantha health problems
Samantha : సమంత మయో సైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈమె జబ్బు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ప్రాణాంతక వ్యాధిగా దీన్ని వైద్యులు చెబుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు అంటున్నారు. దాంతో సమంత ఆరోగ్య పరిస్థితిపై ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఆమె నటించిన సినిమాల పరిస్థితి దారుణంగా ఉంది అంటూ సినీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా నవంబర్ 11 వ తారీఖున ప్రేక్షకుల ముందు రాబోతున్న విషయం తెలిసిందే. సమంత కు ఉన్న స్టార్ డం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున యశోద సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు.
ఒక యూనివర్సల్ సబ్జెక్టు అవ్వడం వల్ల యశోద సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని ప్రతి ఒక్కరూ నమ్మకంతో ఉన్నారు. కానీ సినిమా ఎంత బాగున్న ప్రమోషన్ కార్యక్రమాలు సరిగా చేయక పోతే బొక్క బోర్లా పడడం ఖాయం, అందుకే యశోద సినిమా కి సమంత ప్రమోషన్ కార్యక్రమాలకి హాజరయ్యే పరిస్థితి లేదు కనుక ఇప్పుడు ఆ సినిమా పరిస్థితి ఏంటో అంటూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరో వైపు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది. వచ్చే సంవత్సరం ఆరంభంలో ఆ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు తెలియ జేశారు. సమంత అనారోగ్య పరిస్థితి కారణంగా ఆ సినిమా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హిందీ లో ఈమె రెండు సినిమా లకు కమిట్ అయింది, అందులో ఒకటి తాప్సి నిర్మిస్తోంది మరొకటి వెబ్ సిరీస్ కూడా ఉంది.
Do you know how many crores they have lost due to Samantha health problems
ఇంతగా సినిమాలకు సిరీస్ లకు కమిట్ అయిన సమంత అనూహ్యంగా అనారోగ్యం బారిన పడటంతో ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఆమె షూటింగ్ లో పాల్గొంటుందా లేదా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సమంత అనారోగ్యంతో బెడ్ పై ఉండటం వల్ల నిర్మాతలకు కోట్లలో నష్టం అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఒక హీరోయిన్ లేదా హీరో సినిమా చేసి దాన్ని ప్రమోట్ చేయకుంటే కచ్చితంగా నష్టం తప్పదు.. అలాగే ఒక హీరో లేదా హీరోయిన్ డేట్ ల ఇచ్చి షూటింగ్ కి హాజరు కాకపోయినా నిర్మాతకు భారీగా నష్టం వాటిల్లుతుంది. కనుక ఇప్పుడు సమంత వళ్ళ నిర్మాతలకు చాలా నష్టాలే వస్తున్నాయి. కోట్లల్లో నష్టాలు నమోదు అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది, సమంత త్వరగా కోలుకుంటే నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.