
karthika deepam 01 november 2022 full episode
Karthika Deepam 1 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 నవంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 1498 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కారులో ఇంద్రుడు ఆటోను ఫాలో అవుతుంటాడు కార్తీక్. అక్కడ ఉన్నది శౌర్యయేనా అని టెన్షన్ పడుతుంటాడు కార్తీక్. ఇంతలో ఇంద్రుడు ఇంటి దగ్గరికి వస్తారు కార్తీక్, దీప. కారు దిగుతారు ఇద్దరూ. అక్కడ ఉన్నది శౌర్యే అని ఇద్దరూ అనుకుంటారు. మరోవైపు శౌర్యకు లోపల వేడుక జరుగుతూ ఉంటుంది. ఇంద్రుడు వచ్చాడని చూసి బయటికి వస్తుంది చంద్రమ్మ. నా మనసు ఎందుకో చెబుతోంది డాక్టర్ బాబు. నా బిడ్డ ఇక్కడే ఉంది అని అంటుంది దీప. ఇంతలో ఇంద్రుడు రండి.. లోపలికి రండి అని అంటాడు. దీప తెచ్చిన పిండి వంటలు తీసుకొని అక్కడ పెడతాడు. ఇంతలో ఎందుకో శౌర్య లేచి వెళ్లబోతుండగా తప్పు నువ్వు బయటికి వెళ్లకూడదు. దిష్టి తగులుతుంది అంటుంది చంద్రమ్మ. దీంతో పిన్నీ ఎవరో వచ్చినట్టు అనిపించింది అంటుంది శౌర్య. దీంతో ఇంట్లో ఫంక్షన్ కదా.. చాలామంది వస్తారు అంటుంది చంద్రమ్మ. తనను లోపలికి తీసుకెళ్లమని అక్కడ ఉన్నవాళ్లకు చెబుతుంది చంద్రమ్మ.
karthika deepam 01 november 2022 full episode
బయటికి వస్తుంది చంద్రమ్మ. దీపను చూసి అమ్మ గారు నాకెందుకు తెలియదు గండా. ఆరోజు మన జ్వాలమ్మకు నీళ్ల బాటిల్ ఇచ్చింది కదా అంటుంది. జ్వాలమ్మ లేకపోయి ఉంటే మా ఇంట్లో ఈ పండగే లేకపోయి ఉండేది అని జ్వాల గురించి చెబుతుంది చంద్రమ్మ. జ్వాల లాంటి బిడ్డ ఉంటే ఏ ఇంట్లో అయినా సంతోషమే చంద్రమ్మ అని అంటాడు ఇంద్రుడు. సరే.. పాపను చూపించు అని అంటాడు. దీంతో సరే గండా అని పాపను తీసుకొస్తా అని వేరే పాపను తీసుకొస్తుంది చంద్రమ్మ. దీంతో దీప, కార్తీక్ షాక్ అవుతారు. ఇంద్రుడు కూడా షాక్ అవుతాడు. మా అమ్మాయి జ్వాల అంటుంది చంద్రమ్మ. దీంతో ఈ అమ్మాయా మీ అమ్మాయి అని అంటుంది దీప. దీంతో అవునమ్మా.. మా అమ్మాయే. ముందు బిడ్డ పురిట్లోనే చనిపోతే.. ఎన్నో నోములు నోచాక నాలుగేళ్లకు మళ్లీ ఈ బిడ్డ పుట్టింది. జ్వాలా నరసింహస్వామికి మొక్కుకుంటే పుట్టిందని జ్వాల అని పేరు పెట్టుకున్నాం అంటుంది చంద్రమ్మ.
ఆరోజు బస్టాండ్ లో ఈ అమ్మే నీకు మంచినీళ్ల బాటిల్ ఇచ్చింది. ఇంకోరోజు నువ్వు సరుకులు చెబితే రాసుకుంది కదా. ఈ అమ్మే. థాంక్స్ చెబుతా అన్నావు కదా.. చెప్పు అంటే.. థాంక్స్ అమ్మ అంటుంది జ్వాల. ఆ తర్వాత అక్షింతలు తీసుకొచ్చి ఆశీర్వదించండి అమ్మ అంటుంది చంద్రమ్మ.
దీంతో ఆ అమ్మాయిని దీప, కార్తీక్ ఇద్దరూ ఆశీర్వదించుతారు. చల్లగా ఉండు తల్లి అని దీప దీవిస్తుంది. ఏడుపును దిగమింగుకొని మేము వెళ్లొస్తాం అంటుంది దీప. దీంతో అప్పుడేనా భోం చేసి వెళ్లండి అంటుంది చంద్రమ్మ. దీంతో వద్దమ్మా.. పాపను చూసి వెళ్దామని వచ్చాం.. అంటుంది దీప.
బయటికొచ్చి కారు దగ్గర వెక్కి వెక్కి ఏడుస్తుంది దీప. మరోవైపు బాబాయి వచ్చినట్టున్నాడు అని అనుకొని బయటికి వస్తుంది శౌర్య. పదా.. వెళ్దాం అంటాడు కార్తీక్. బయటికి రాబోతుండగా శౌర్యను లోపలికి తీసుకెళ్తుంది చంద్రమ్మ. లోపలికి తీసుకెళ్లి డోర్ పెడుతుంది.
ఇంతలో కార్తీక్, దీప అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఏంటి నువ్వు చేసిన పని.. జ్వాలమ్మను వాళ్లకు ఇచ్చేద్దాం అనుకున్నాం కదా.. అంటే నాకు మనసు ఒప్పుకోలేదు అని అంటుంది చంద్రమ్మ. వాళ్లకంటే నువ్వు ఏమైపోతావో అనే భయమే ఎక్కువైపోయింది అంటుంది చంద్రమ్మ.
వాళ్లు ఇంటికి వస్తాం అని చెప్పినప్పటి నుంచి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో చూశాను అంటుంది. దీంతో జ్వాలమ్మను వదిలి నువ్వు ఉండగలవా అంటాడు ఇంద్రుడు. మన బిడ్డ పోయింది. మనం ఎన్నాళ్లు బాధపడ్డాం. మరిచిపోలేదూ.. మన ప్రేమతో ఆ బాధను మరిచిపోయేలా చేయగలనన్న నమ్మకం నాకుంది గండ అంటుంది చంద్రమ్మ.
జ్వాలమ్మ ఎవరి బిడ్డ అనేది ఇక నుంచి మరిచిపో. మన బిడ్డే. ఇక నుంచి వాళ్లు మన ఇంటికి రారు. కానీ.. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. జ్వాలమ్మ వాళ్ల కంట పడకుండా ఉంటుంది. నువ్వు మాత్రం పొరపాటున జ్వాలమ్మ దగ్గర ఈ ప్రస్తావన తీసుకురావద్దు. సరేనా అంటుంది చంద్రమ్మ.
మరోవైపు కారులో దీప ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తుంది. శౌర్య అక్కడ లేకపోవడం ఏంటి. శౌర్య గొంతే. నేను విన్నాను అంటుంది దీప. లేకపోతే అంత ఖచ్చితంగా శౌర్య గొంతే అని ఎందుకు చెబుతాను. నా బిడ్డ అన్న నమ్మకమే లేకపోతే.. నా బిడ్డ అనుకొని వేరే ఎవరి బిడ్డ కోసం ఎందుకు వెళ్తాను అంటుంది దీప.
అసలు శౌర్య ఇక్కడ ఉందా అనే అనుమానం వస్తోంది అంటుంది దీప. దీంతో ఉంది.. ఖచ్చితంగా ఉంది అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.