Bheemla Nayak : భీమ్లా నాయక్‌లో రానా రెమ్యూనరేషన్ పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువా.. ఎంతో తెలుసా…?

Authored By vamana sai | The Telugu News | Updated on: September 26, 2021, 9:39 am

Bheemla Nayak: భీమ్లా నాయక్‌..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తోంది. భీమ్లా నాయక్‌ గా పవన్ కళ్యాణ్, డానియల్ శేఖర్‌గా రానా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్, రానాల టీజర్స్ సినిమా మీద భారీ అంచనాలు పెంచాయి. అలాగే సాంగ్ కూడా విపరీతంగా ఆకట్టుకొని సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

do you know rana remuniration in bheemla-nayak

do you know rana remuniration in bheemla-nayak

మలయాళంలో సూపర్ హిట్‌గా నటించిన అయ్యప్పనుం కోషియం సినిమాకి అఫీషియల్ రీమేక్‌గా తెరకెక్కుతోంది. త్రివిక్రం శ్రీనివాస్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తైన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా 2022, జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్‌పై సూర్యదేవర నాగ వంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఇటీవల రానా టీజర్ రిలీజైనప్పటి నుంచి తన రెమ్యునరేషన్ గురించి ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.

Bheemla Nayak: రానాకు 15 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తున్నట్టు తెలుస్తోంది.

do you know rana remuniration in bheemla-nayak

do you know rana remuniration in bheemla-nayak

కొందరేమో పవన్ కంటే ఎక్కువ తీసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కోసం రానా 25 రోజుల కాల్షీట్లు కేటాయించారని నిర్మాతలు రానాకు 15 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రానా పాత్రను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. ఇక పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకి 50 కోట్లు తీసుకుంటున్నాడట. రానా సరసన సంయుక్తా మీనన్ నటిస్తోంది. కాగా రానా నటించిన విరాట పర్వం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే వచ్చే ఏడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమా సీక్వెల్ తెరకెక్కే అవకాశాలున్నాయి.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp