comedian ali : కమెడియన్ ఆలీ ఆస్తుల విలువ తెలిస్తే మీరు షాక్..!
comedian ali: 1981లో ‘సీతాకోక చిలుక’ ఫిల్మ్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆలీ.. కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ కమెడియన్‌గా ఉంటూనే మధ్యలో హీరోగా కొన్ని సినిమాలు కూడా చేశాడు. ఆ సినిమాలు సూపర్ హిట్ అయినప్పటికీ ఆలీ కమెడియన్‌గానే కొనసాగాడు. అవకాశాలు వచ్చినపుడు హీరోగా చిత్రాలు చేస్తూనే కమెడియన్‌గా చిత్రాల్లో నటిస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు దాదాపుగా 1,100కిపైగా చిత్రాల్లో నటించాడు ఆలీ.ఆలీకి నటుడిగా మాత్రమే కాకుండా సామాజికవేత్తగానూ మంచి పేరుంది. తన తండ్రి పేరిట ‘మహమ్మద్ భాషా చారిటబుల్ ట్రస్ట్’ పెట్టి నిరుపేదలకు తన వంతు సాయం చేస్తున్నాడు ఆలీ.
comedian ali : 250వ ఎపిసోడ్‌కు ‘ఆలీతో సరాదాగా’ప్రోగ్రాం..
ఆలీ ఆస్తుల విలువ సుమారు రూ.750 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఏడాదికి ఆలీ దాదాపు రూ.12 కోట్లు సంపాదిస్తారట. ఆలీకి హైదరాబాద్ జూబ్లీహిల్స్ రూ.రెండు కోట్ల విలువ చేసే ఇల్లుతో పాటు వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఆలీకి ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ ఏ రోజు కూడా పొగరు ప్రదర్శించలేదు. అవసరమున్న వారికి హెల్ప్ చేసేందుకు ఎల్లప్పుడు ముందుంటారు ఆలీ. కమెడియన్‌గా ఉంటూనే ఆలీ వ్యాఖ్యాతగానూ రాణిస్తున్నారు. ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రామ్ ఆలీనే యాంకర్. ఈ షోకు సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు, నటులను ఆహ్వానించి సరదాగా ముచ్చటిస్తూ ఇంటర్వ్యూ చేస్తుంటారు ఆలీ.
ఆలీతో ఇంటర్వ్యూ ఇచ్చేందుకు సెలబ్రిటీలు అందరూ ఓకే చెప్తారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. ఇటీవల ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాం 250 వ ఎపిసోడ్‌కు చేరుకుంది. ఈ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా టాలీవుడ్ సీనియర్ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, విద్యావేత్త, డైలాగ్ కింగ్ మోహన్‌బాబు వచ్చారు. ఈ షోలో తన జీవిత విశేషాలు పంచుకున్నారు మోహన్ బాబు. ఆలీ సీనియర్ హీరోల చిత్రాలతో పాటు యంగ్ హీరోల చిత్రాల్లోనూ కమెడియన్‌గా నటిస్తుండటం విశేషం. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్ని చిత్రాల్లో, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చిత్రాలు అన్నిటిలోనూ ఆలీ దాదాపుగా ఉంటారు.