Bimbisara Child Artist : బింబిసారలో నటించిన చైల్డ్ ఆర్టిస్టు ఎవరో తెలుసా..!

 Authored By prabhas | The Telugu News | Updated on :13 August 2022,4:40 pm

Bimbisara Child Artist : కరోనా కష్టకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కరోనా నుంచి ఎట్టకేలకు కోలుకున్న చిత్ర పరిశ్రమకు శుభవార్త ఏదైనా ఉంది అంటే మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే మన సినిమాలు చాలా మేరకు విజయవంతం కావడమే. బహుబలి-2 తర్వాత ఇండస్ట్రీకి పెద్దగా హిట్లు రాలేదు. ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాల్లో అఖండ, పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు ఉండగా.. తాజాగా బింబిసార సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారింది. మంచి కంటెంట్‌తో వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఇక బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘అఖండ’, ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’, తాజాగా రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ ‘బింబిసార’..

ఈ మూడు నందమూరి హీరోల మూవీలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.ఇందులో కామన్ పాయింట్ ఎమిటంటే..ఈ మూడు కథలు ఒక పాప చుట్టూ తిరిగే మూవీస్ కావడమే. ఆర్ఆర్ఆర్‌లో మల్లి అనే పాప కోసం ఎన్టీఆర్ స్టోరీ నడుస్తుంది. ఇక లేటెస్టుగా వచ్చిన ‘బింబిసార’ కూడా పాప చుట్టూ కథ అంత నడుస్తుంటుంది.తనను రక్షించిన పాప కోసం బింబిసారుడు ఎలా మారిపోయాడనేదే స్టోరీ.. ఇక ‘బింబిసార’ లో సినిమాలో నటించిన పాప పేరు శ్రీదేవి. ఈ పాపకి ఇది తొలి మూవీ కాదు. దీనికి ముందు ‘రామారావు ఆన్‌ డ్యూటీ’, ‘మేజర్‌’ వంటి మూవీస్ లో కూడా ఈ చిన్నారి నటించి మంచి పేరును సంపాదించుకుంది.

Do you know who is the child artist in Bimbisara

Do you know who is the child artist in Bimbisara

అలాగే ప్రేమ, యమలీల, కళ్యాణ వైభోగమే వంటి సీరియల్స్ లో కూడా నటించి మంచి మెప్పు పొందింది.ఇక శ్రీదేవి తన తండ్రి ద్వారా మూవీస్ లోకి అడుగు పెట్టింది. శ్రీదేవి తండ్రి పేరు శ్రీహరి గౌడ్‌. ఇతను ఆర్టిస్టు మాత్రమే కాదు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ కూడా. కర్నూలు జిల్లా బేతంచెర్లకు చెందిన వ్యక్తి.షూటింగ్స్ కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఇక ‘బింబిసార’ సినిమాకి గాను శ్రీదేవికి మంచి గుర్తింపు వచ్చింది.క్యూట్‌ లుక్స్‌తో ఉన్న ఈ పాప యాక్టింగ్ కూడా తన వయస్సుకు మించి చేసిందని అభిమానులు చెబుతున్నారు.శ్రీదేవి హావభావాలు, డైలాగులు సినిమాకు మంచి పేరు తీసుకొచ్చాయని చెప్పుకుంటున్నారు.

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి