SS Rajamouli : మహేష్ బాబు కోసం దేశం మొత్తం బిత్తరపోయే హీరోయిన్ ని తీసుకొచ్చిన రాజమౌళి.. ఏముందిరా బాబు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

SS Rajamouli : మహేష్ బాబు కోసం దేశం మొత్తం బిత్తరపోయే హీరోయిన్ ని తీసుకొచ్చిన రాజమౌళి.. ఏముందిరా బాబు!

SS Rajamouli : ప్రస్తుతం సినీ అభిమానులంతా ఎదురు చూసేది.. రాజమౌళి నుంచి వచ్చే తదుపరి సినిమా గురించే. ఎందుకంటే.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ విడుదలై దాదాపు చాలా రోజులు అవుతోంది. ఆర్ఆర్ఆర్ ప్రపంచ సినీ చరిత్రలోనే రికార్డులను తిరగరాసింది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమాపై అందరికీ అంచనాలు ఇంకా పెరిగాయి. అయితే.. రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తర్వాత తను చేయబోయే సినిమా మహేశ్ బాబుతో అని ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించిన స్టోరీ వర్క్ […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :23 October 2022,10:30 am

SS Rajamouli : ప్రస్తుతం సినీ అభిమానులంతా ఎదురు చూసేది.. రాజమౌళి నుంచి వచ్చే తదుపరి సినిమా గురించే. ఎందుకంటే.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ విడుదలై దాదాపు చాలా రోజులు అవుతోంది. ఆర్ఆర్ఆర్ ప్రపంచ సినీ చరిత్రలోనే రికార్డులను తిరగరాసింది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమాపై అందరికీ అంచనాలు ఇంకా పెరిగాయి. అయితే.. రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తర్వాత తను చేయబోయే సినిమా మహేశ్ బాబుతో అని ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించిన స్టోరీ వర్క్ కూడా నడుస్తోంది. ప్రపంచాన్ని చుట్టేసే ఓ యాత్రికుడి కథే ఈ సినిమా. ఈ సినిమాలో మహేశ్ బాబు ఒక ట్రావెలర్ గా కనిపించనున్నారు.

ఇది ఒక గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ త్రిల్లర్ అని జక్కన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఇతర నటీనటులను ఎవరి తీసుకుంటాడో జక్కన్న అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ తో జపాన్ చెక్కేసిన విషయం తెలిసిందే. అక్కడ జపాన్ లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అక్కడి నుంచి తిరిగి వచ్చాక మహేశ్ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. రాజమౌళి సినిమాలో ఒక్క సీన్ లో అయినా నటించాలని అందరు నటులు ఆశపడతారు. ఎంత పెద్ద స్టార్లు అయినా రాజమౌళి సినిమాను చేయం అని చెప్పరు. ఆయన డేట్స్ కోసం స్టార్లే ఎదురు చూస్తారు.

do you know who is the heroine in ss rajmouli and mahesh babu movie

do you know who is the heroine in ss rajmouli and mahesh babu movie

SS Rajamouli : మహేశ్ సరసన దీపికా పదుకొణెను హీరోయిన్ గా సెలెక్ట్ చేసిన జక్కన్న

అలాంటిది మహేశ్ సినిమాలో హీరోయిన్ ను ఎవరిని ఎంపిక చేస్తాడో జక్కన్న అని అంతా ఆతృతగా ఎదురు చూశారు. దీంతో చివరకు బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనెను జక్కన్న ఎంపిక చేశారట. మహేశ్ కు జోడిగా దీపిక అయితే కరెక్ట్ గా సరిపోతుందని జక్కన్న భావించారట. దీపిక ఇప్పటికే ప్రభాస్ సినిమా ప్రాజెక్ట్ కే లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. అయినా కూడా జక్కన్న దీపికకే ఓటేశారు. దానికి కారణం.. దీపిక ఇప్పటికే స్టార్ హీరోయిన్ కావడం, మహేశ్ కు సరైన జోడి అని అనిపించిందేమో.. వెంటనే దీపికను ఎంపిక చేశారట. ఇక.. మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యాక.. రాజమౌళి సినిమాకు తన డేట్స్ ను కేటాయించనున్నారు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.

Tags :

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది