
Rajamouli likes Mahesh Babu so much
SS Rajamouli : ప్రస్తుతం సినీ అభిమానులంతా ఎదురు చూసేది.. రాజమౌళి నుంచి వచ్చే తదుపరి సినిమా గురించే. ఎందుకంటే.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ విడుదలై దాదాపు చాలా రోజులు అవుతోంది. ఆర్ఆర్ఆర్ ప్రపంచ సినీ చరిత్రలోనే రికార్డులను తిరగరాసింది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమాపై అందరికీ అంచనాలు ఇంకా పెరిగాయి. అయితే.. రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తర్వాత తను చేయబోయే సినిమా మహేశ్ బాబుతో అని ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించిన స్టోరీ వర్క్ కూడా నడుస్తోంది. ప్రపంచాన్ని చుట్టేసే ఓ యాత్రికుడి కథే ఈ సినిమా. ఈ సినిమాలో మహేశ్ బాబు ఒక ట్రావెలర్ గా కనిపించనున్నారు.
ఇది ఒక గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ త్రిల్లర్ అని జక్కన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఇతర నటీనటులను ఎవరి తీసుకుంటాడో జక్కన్న అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ తో జపాన్ చెక్కేసిన విషయం తెలిసిందే. అక్కడ జపాన్ లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అక్కడి నుంచి తిరిగి వచ్చాక మహేశ్ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. రాజమౌళి సినిమాలో ఒక్క సీన్ లో అయినా నటించాలని అందరు నటులు ఆశపడతారు. ఎంత పెద్ద స్టార్లు అయినా రాజమౌళి సినిమాను చేయం అని చెప్పరు. ఆయన డేట్స్ కోసం స్టార్లే ఎదురు చూస్తారు.
do you know who is the heroine in ss rajmouli and mahesh babu movie
అలాంటిది మహేశ్ సినిమాలో హీరోయిన్ ను ఎవరిని ఎంపిక చేస్తాడో జక్కన్న అని అంతా ఆతృతగా ఎదురు చూశారు. దీంతో చివరకు బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనెను జక్కన్న ఎంపిక చేశారట. మహేశ్ కు జోడిగా దీపిక అయితే కరెక్ట్ గా సరిపోతుందని జక్కన్న భావించారట. దీపిక ఇప్పటికే ప్రభాస్ సినిమా ప్రాజెక్ట్ కే లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. అయినా కూడా జక్కన్న దీపికకే ఓటేశారు. దానికి కారణం.. దీపిక ఇప్పటికే స్టార్ హీరోయిన్ కావడం, మహేశ్ కు సరైన జోడి అని అనిపించిందేమో.. వెంటనే దీపికను ఎంపిక చేశారట. ఇక.. మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యాక.. రాజమౌళి సినిమాకు తన డేట్స్ ను కేటాయించనున్నారు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.
Mana Shankara Vara Prasad Garu Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…
Bhatti Vikramarka : ప్రజాభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…
Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…
Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…
Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన…
Pushpa-3 : తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన ప్రశ్న ఒక్కటే పుష్ప–3 (Pushpa-3)ఉంటుందా? లేక ఇది…
YCP : అన్నమయ్య జిల్లా(Annamaya District)లో చోటుచేసుకున్న నకిలీ మద్యం(Fake alcohol) ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఫ్రెండ్స్తో…
PM Svanidhi: చిన్నచిన్న వ్యాపారాలే ఆధారంగా జీవించే వీధి వ్యాపారుల(Street vendors)కు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం…
This website uses cookies.