Home » Entertainment » Durga Plans To Disrupt Mounitha And Karthik Relationship
Entertainment

Karthika Deepam : మోనితకు అసలైన షాక్.. అసలు వ్యక్తి ఎంట్రీ.. మోనిత బండారం మొత్తం కార్తీక్ కు తెలిసిపోతుందా?

Authored By
Varun G
The Telugu News | Published on: October 23, 2022, 10:00 am
Advertisement

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. కార్తీక దీపం సీరియల్ 24 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 1491 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీపకు వార్నింగ్ ఇద్దామని వచ్చి మోనిత దీప దగ్గర ఇరుక్కుపోతుంది. విన్నారు కదా డాక్టర్ బాబు.. మోనిత మాటలు అంటూ ఏదో ఊరికే అంటుంది దీప. దీంతో తెగ భయపడిపోతుంది మోనిత. లేదు కార్తీక్. ఏదో ఊరికే అన్నా.. నేనే నీ భార్యను అంటూ కంగారు పడుతుంది మోనిత. దీంతో తెగ నవ్వుకుంటుంది దీప. చూశావా.. నేను ఏదో ఊరికే అంటే అంతలా కంగారు పడుతున్నావు అంటూ దీప మోనితకు షాకిస్తుంది. దీంతో నీ సంగతి తేల్చుతా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత.

Advertisement

durga plans to disrupt mounitha and karthik relationship

మరోవైపు రౌడీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. రౌడీ ఇక్కడే కనిపించింది. తన నవ్వు కూడా వినిపించింది. రేపు మళ్లీ ఒకసారి రౌడీ కోసం వెతకాలి అని అనుకుంటాడు. ఇంటికి వచ్చాక ఆనంద్ ఏడుపు వినిపిస్తూ ఉంటుంది కార్తీక్ కు. మోనిత అస్సలు ఆనంద్ ను పట్టించుకోకుండా అక్కడే కూర్చొని కార్తీక్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్లిన కార్తీక్.. వెంటనే బాబును తీసుకొని అసలు నీకు బాబు గురించి పట్టింపే లేదా అంటాడు. దీంతో బాబు ఏడుపు తనకు వినిపించలేదని అంటుంది మోనిత.

Advertisement

ఉదయం లేవగానే శివ బయటి నుంచి రావడం చూసి ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అని అడుగుతుంది మోనిత. దీంతో వంటలక్క ఇంట్లో పడుకొని వస్తున్నా అని చెబితే ఏమనుకుంటుందో అని మార్నింగ్ వాక్ చేసి వస్తున్నా అంటాడు శివ.

ఆ తర్వాత నిజం చెప్పు అంటుంది. దీంతో వంటలక్క ఇంటి ముందు రోజూ పడుకో అని సార్ చెప్పాడు అంటాడు శివ. దీంతో మోనితకు మరో డౌట్ మొదలవుతుంది. అసలు కార్తీక్ ఎందుకు ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని టెన్షన్ పడుతుంది.

Advertisement

Karthika Deepam : మోనితను కార్తీక్ ముందు అడ్డంగా బుక్ చేసిన దుర్గ

మరోవైపు కార్తీక్.. తన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మోనిత.. కార్తీక్ కాఫీ తీసుకురానా అంటుంది. దీంతో మంచి టైమ్ కు వచ్చావు తీసుకురా కాఫీ అంటాడు కార్తీక్.

అవును దుర్గా గారు ఎక్కడ అని అడుగుతాడు కార్తీక్. దీంతో ఏమో తెలియదు అంటుంది. దుర్గాకు కాఫీ ఇచ్చావా అని అడుగుతాడు కార్తీక్. దీంతో వాడికి నేను కాఫీ ఎందుకు ఇస్తాను అంటుంది మోనిత.

ఇంతలో అక్కడికి వచ్చిన దుర్గా.. కాఫీ చాలా బాగుంది బంగారం అంటాడు. దీంతో మోనిత షాక్ అవుతుంది. కార్తీక్ కు కోపం వస్తుంది. ఆ తర్వాత దీపకు ఇంద్రుడు చెప్పిన విషయం గుర్తొస్తుంది.

ఆ అమ్మాయి శౌర్యనా అని అనుకుంటుంది. వెంటనే ఆ ఆటోను వెతకాలని వెళ్తుంది. అప్పుడే కార్తీక్ తనకు తారసపడతాడు. అదే సమయంలో ఆటోలో శౌర్య వెళ్లడం చూస్తుంది దీప. ఇద్దరూ కలిసి శౌర్యను వెతికేందుకు వెళ్తారు.

Advertisement

ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. నా మొగుడితో తిరుగుతున్నావేంటి అని దీప మీద చిరాకుపడుతుంది మోనిత. ఇంతలో ఓ మహిళ వచ్చి మోనిత చెంప చెళ్లుమనిపిస్తుంది. దీంతో మోనిత షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి