Home » Entertainment » Emmanuel Fun With Anupama In Sridevi Drama Company Latest Promo
Entertainment

Anupama : అనుపమని కూడా వదిలి పెట్టడం లేదు.. ఇమాన్యుయేల్ మాములోడు కాదు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: July 28, 2022 1:15 pm
Advertisement

Anupama : బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రస్తుతం బోనాలు ప్రత్యేకంగా కావడంతో ప్రతి ఒక్క ఛానల్లో బోనాల జాతర నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా బోనాల జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు బుల్లితెర నటీనటులు హాజరయ్యి ఆటపాటలతో ప్రేక్షకులను సందడి చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

Advertisement

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా కార్తికేయ 2 చిత్ర బృందం సందడి చేశారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో నిఖిల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈ వేదికపై సందడి చేశారు. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ పాట పాడి అందరిని సందడి చేయగా అనంతరం ఈమె మాట్లాడుతూ చిన్నప్పుడు బోనాల జాతరలో తన భావ తప్పిపోయాడని చెప్పగానే వెంటనే ఇమాన్యుయేల్ నేనే అనుపమ భావను అంటూ వేదిక పైకి వచ్చారు. అనుపమ బావ అంటూ వేదిక పైకి వచ్చిన ఇమాన్యుయేల్ దొండకాయ్..

Emmanuel Fun With Anupama In Sridevi Drama Company Latest Promo

Advertisement

బెండకాయ్ అనుపమ నా గుండెకాయ్ అంటూ ఇమాన్యుయేల్ రెచ్చిపోయి అనుపమతో పులిహోర కలపడానికి ప్రయత్నం చేశారు. ఇమాన్యుయేల్ ఈ విధంగా చెప్పడంతో ఒక్కసారిగా అనుపమ ఆశ్చర్యంగా అతని వంక చూశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ కావడంతో ఇది చూసిన నేటిజెన్లు ఇమాన్యుయేల్ మామూలోడు కాదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ప్రోమోనే ఈ విధంగా ఉంటే పూర్తి ఎపిసోడ్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి