Home » Entertainment » Emmanuel Satires On Sudigali Sudheer Goin Into Star Maa In Extra Jabardasth
Entertainment

Sudigali Sudheer : స్టార్ మాకి జంప్ అయిన సుడిగాలి సుధీర్.. రష్మీని అడ్డు పెట్టుకుని ఇమాన్యుయేల్ సెటైర్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: May 28, 2022 1:30 pm
Advertisement

Sudigali Sudheer : బుల్లితెరపై రష్మీ సుధీర్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జోడికి ఇప్పటికీ ఎప్పటికీ క్రేజ్ అలానే ఉంటుంది. ఈ ఇద్దరినీ జోడిగా చూడాలని ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు. అయితే బయట కొందరు అభిమానులు మాత్రం కొద్దిగా హద్దులు దాటుతుంటారు. ఇద్దరూకలిసి పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు కోరుకుంటుంటారు.అయితే సుధీర్ ఈ మధ్యఈటీవీలో కనిపించడం లేదు. ఢీ షో నుంచి దూరంగా వెళ్లిపోయాడు. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలోనూ కనిపించడం లేదు.

Advertisement

కేవలం ఒక్క శ్రీదేవీ డ్రామా కంపెనీలోనే కనిపిస్తున్నాడు. అది కూడా రేపో మాపో మానేస్తాడు అనే టాక్ అయితే వస్తోంది. అయితే ఇదే విషయం మీద తాజాగా ఓ స్కిట్లో పంచ్ వేశారు. వచ్చే వారం ఎక్స్ ట్రా జబర్దస్త్ షో ప్రోమో విడుదలైంది.ఇందులో బాహుబలి స్పూప్ వేశారు. కట్టప్పకు పెళ్లై, ఫైమా లాంటి భార్య వస్తే ఎలా ఉండేదో చేసి చూపించారు. శివగామిగా రమ్యకృష్ణ నటించింది. కట్టప్పగా ఇమాన్యుయేల్ కనిపించాడు. అయితే జడ్జ్‌గా వచ్చిన సదా మీద మొదటి పంచ్ వేశారు.

Emmanuel Satires On Sudigali Sudheer Goin Into Star Maa In Extra Jabardasth

Advertisement

ఈమే ఏ రాజ్యానికి మహారాణి అని రోహిణి అంటుంది. వెళ్లవయ్యా వెళ్లు అనే రాజ్యానికి మహారాణి అని అంటాడు.ఇక రష్మీని చూపించి.. ఈమె ఏ రాజ్యానికి మహారాణి అని రోహిణి అడుగుతుంది. చెలికత్తెను పట్టుకుని మహారాణి అంటారేంటని ఇమాన్యుయేల్ అడుగుతాడు. ఎవరి కోసం ఎదురుచూస్తోంది అని రోహిణి అడుగుతుంది. ఆమె ప్రియుడి కోసం.. ఈ మధ్యే పక్క రాజ్యానికి వెళ్లాడు అని పరోక్షంగా సుధీర్ స్టార్ మాకు వెళ్లడంపై ఇమాన్యుయేల్ సెటైర్ వేశాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి