Director Kalyan Krishna Not Happy
Kalyan Krishna : ఈ మధ్యకాలంలో హిట్ ఇస్తున్న దర్శకులకు ఎందుకనో మళ్ళీ అవకాశాలు దక్కడం లేదు. అలా అలా రేస్‌లో వెనకబడిపోతున్నారు కొందరు టాలెంటెడ్ డైరెక్టర్స్. అలాంటి వారిలో కళ్యాణ్ కృష్ణ కురసాల ఒకరు. ఆయన అక్కినేని స్టార్ హీరోలకు వరుసగా రెండు మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. 2016లో అక్కినేని నాగార్జున డ్యూయల్ రోల్‌లో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్‌గా కళ్యాణ్ కృష్ణ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. నాగార్జున బాడీ లాంగ్వేక్‌కు తగ్గట్టు చక్కటి విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీని యమలోకంతో ముడిపెట్టి అద్భుతంగా తెరకెక్కించి దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు కళ్యాణ్ కృష్ణ కురసాల.
ఆయన మొదటి చిత్రం భారీ హిట్ సాధించడంతో ఆ తర్వాత నాగ చైతన్య – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ‘రారండోయ్ వేడుకచూద్దాం’ అనే మంచి కుటుంబ కథా చిత్రాన్ని తీసి మరో సూపర్ హిట్ అందుకున్నారు. అయితే, మరో హిట్ కోసం సినిమాగా మాస్ మహారాజా రవితేజతో ‘నేల టికెట్’ తీసి అనూహ్యంగా
ఫ్లాప్ చూశారు. ఈ సినిమా రవితేజకు పెద్ద మైనస్ అయితే, ఇదే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన మాళవిక శర్మ అడ్రస్ లేకుండా పోయింది. దాంతో కాస్త గ్యాప్ వచ్చేసింది. ఇక నాగార్జున సోగాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ చేద్దామని ఆఫర్ ఇచ్చారు.
Director Kalyan Krishna Not Happy
దాంతో దాదాపు ఈ ప్రాజెక్ట్ మీద నాలుగేళ్ళు శ్రమించారు. నాగార్జునను మెప్పించడానికి కొంత సమయం పడితే కరనా కారణంగా మరికొంత సమయం పట్టింది. ఏదేమైనా ఈ దర్శకుడు ‘బంగార్రాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మళ్ళీ సాలీడ్ హిట్ అందుకున్నారు. అక్కినేని హీరోలు కింగ్ నాగార్జున – నాగచైతన్య హీరోలుగా ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్ గా ఈ సినిమా రూపొందించారు. కళ్యాణ్ కృష్ణకు ఈ సినిమాతో మచి పేరే వచ్చింది. అయితే, ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ దర్శకుడు చెప్పిన కథలు మన హీరోలకు నచ్చడం లేదా లేక పాన్ ఇండియా రేంజ్‌లో ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటున్నాడా..! అనేది క్లారిటీ లేదు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.