Esha Gupta : స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై ఇషా గుప్తా క్లారిటీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Esha Gupta : స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై ఇషా గుప్తా క్లారిటీ

 Authored By ramu | The Telugu News | Updated on :25 June 2025,10:00 pm

ప్రధానాంశాలు:

  •  హార్దిక్ పాండే తో నాకు టైం కలిసిరాలేదు - ఇషా కీలక వ్యాఖ్యలు

  •  Esha Gupta : స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై ఇషా గుప్తా క్లారిటీ

Esha Gupta  : బాలీవుడ్‌ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్‌ అయ్యింది. గతంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యతో డేటింగ్ చేస్తున్నారన్న పుకార్లు రూమర్లుగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇషా గుప్తా, ఈ విషయంపై స్పందిస్తూ, “కొంతకాలం మేమిద్దరం మాట్లాడుకున్నాం, ఒకట్రెండు సార్లు కలిశాం. కానీ అది పూర్తిగా డేటింగ్ స్టేజ్‌కి చేరుకోకముందే మా మధ్య బంధం తెగిపోయింది” అని తెలిపింది.

Esha Gupta స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై ఇషా గుప్తా క్లారిటీ

Esha Gupta : స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై ఇషా గుప్తా క్లారిటీ

Esha Gupta హార్దిక్ పాండే తో తో సంబంధం ఉందా..? హాట్ బ్యూటీ చెప్పిన అసలు విషయాలు

ఒక బంధంలోకి అడుగుపెడతామా లేదా?” అనే దశలో ఉన్నప్పటికీ, ఆ టైమింగ్, కంపాటిబిలిటీ కలిసి రాలేదు. తమ బంధంలో ఎటువంటి నెగటివిటీ, డ్రామా లేకుండా సహజంగా ముగిసిపోయిందని ఇషా స్పష్టం చేసింది. ఇషా ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉండటంతో పాటు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో ఆకట్టుకుంటోంది.

ప్రొఫెషనల్ గా హార్దిక్ పాండ్య బరిలో జోరుగా ఉండగా, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. 2020లో బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్‌తో వివాహం చేసుకున్న ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి హార్దిక్ సింగిల్ గానే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇషా గుప్తా వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది